బరువు తగ్గేందుకు
బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే అంజీర తినండి. దీనిలో పీచు అధికంగా ఉంటుంది. కెలొరీలు తక్కువగా లభిస్తాయి అందుకే రోజూ అల్పాహారం తిన్న తరువాత కనీసం రెండు మూడు అంజీరా పండ్లయినా తిని చూడండి. క్రమేపీ బరువు తగ్గుతారు. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
రక్తపోటు అదుపులో
రక్తహీనతతో బాధపడేవారు. అంజీరాను రోజూ తింటే.. ఈ సమస్యను సులువుగా అధిగమించొచ్చు. దీనిలో ఎక్కువగా ఉండే పొటాషియం వల్ల రక్తపోటు తగ్గడమే కాక సోడియం ద్వారా వచ్చే దుష్ప్రభావాలు తగ్గుతాయి. ఫలితంగా గుండె, మూత్రపిండాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు.