తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

అందం, ఆరోగ్యం.. రేగుతో సాధ్యం! - తెలంగాణ వార్తలు

ఇది రేగు పండ్ల కాలం. కానీ వాటిని ఏదో సరదాగా తినడమే తప్ప, ఓ ఆరోగ్యకరమైన పండుగా గుర్తించి తినేవాళ్ల సంఖ్య తక్కువ. కానీ రేగు పండ్లలో ఔషధ గుణాలనేకం అంటున్నారు ఆయుర్వేద, అల్లోపతీ వైద్యనిపుణులు. అన్నింటికన్నా ముఖ్యంగా అత్యధిక శాతం ఎదుర్కొనే నిద్రలేమి సమస్యకి చక్కని మందు రేగు అంటున్నాయి తాజా పరిశోధనలు.

amazing-health-benefits-of-eating-jujube
రేగు... బహు బాగు!

By

Published : Jan 24, 2021, 12:56 PM IST

రేగు పండులోని సుగుణాలు తెలిస్తే... దానిని విడిచిపెట్టలేం అంటున్నారు నిపుణులు. పండ్లలోని ప్రత్యేకమైన యాంటీఆక్సిడెంట్లు నిద్ర పట్టేలా చేయడమే కాదు, మెదడు పనితీరునీ ప్రభావితం చేయడం ద్వారా ఆందోళన, డిప్రెషన్‌ వంటి మానసిక సమస్యల్ని తగ్గిస్తాయట. వీటి గింజల నుంచి తీసిన తైలం మతిమరుపు, ఆల్జీమర్స్‌ వంటి వాటినీ నివారిస్తుందని తేలింది.
*రేగుపండ్లలోని పాలీశాకరైడ్లు పొట్టలోని మంటని తగ్గిస్తాయి. ఇంకా రోగనిరోధకశక్తిని పెంచి క్యాన్సర్‌ కణాలు పెరగకుండా చేస్తాయి.
*వీటిల్లో అధికంగా ఉండే పొటాషియం రక్తనాళాల పనితీరుకి తోడ్పడుతుంది. తద్వారా బీపీ, హృద్రోగ సమస్యలు రాకుండా చేస్తుంది.
*రోజూ రెండుమూడు రేగుపండ్లు తినే వాళ్లలో అల్సర్లూ గ్యాస్ట్రిక్‌ సమస్యలూ రావట. మలబద్ధకం కూడా ఉండదు.
*ఈ పండ్లలో సమృద్ధిగా ఉండే విటమిన్‌-ఎ, సిలు రోగనిరోధకశక్తిని పెంచుతాయి. వీటిల్లోని కాల్షియం, పాస్ఫరస్‌ ఖనిజాలు ఎముక సమస్యలు, నాడీసంబంధ సమస్యలతో బాధపడేవాళ్లకి ఎంతో మేలు చేస్తాయి.
*ఈ పండ్లలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు మొటిమలు, దద్దుర్లు... వంటి చర్మసంబంధ సమస్యల్నీ నివారిస్తాయట.

ABOUT THE AUTHOR

...view details