అవసరమైనప్పుడు కెమెరా బయటకు వచ్చి, వద్దనుకున్నప్పుడు దాచేసుకునే వీలుంటే...? ఆ సౌకర్యం శాంసంగ్ తీసుకొస్తున్నట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరలయ్యాయి.
చిన్నప్పుడు టిక్ టిక్ పెన్నులు చూసే ఉంటాం కదా. కెమెరాలను అలానే ఫోన్లకు అమర్చనున్నారు. నొక్కితే బయటకు వస్తుంది. లేదంటే ఫోన్ లోపలే ముడుచుకుని ఉంటుంది. ఇలా ఎందుకు అంటే కెమెరా పట్టే స్థానంలోనూ స్రీన్ సైజు పెంచుకునేందుకు. శాంసంగ్ తీసుకొచ్చే ఈ సరికొత్త చరవాణిలలో అమర్చే కెమెరాల సైజు, పిక్సెల్స్ వివరాలు మాత్రం తెలియలేదు.
కనిపించని కెమెరాతో అదిరే సెల్ఫీ కనిపించని కెమెరాతో అదిరే సెల్ఫీ ఇప్పటికే చాలా స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థలు కెమెరాల సంఖ్య, సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతున్నాయి. బ్రాండ్ ఇమేజ్ ఉన్న శాంసంగ్ సైతం ఇదే బాట పట్టింది. వెనుక భాగంలో 3 కెమెరాలతో ఫోన్ తీసుకురానుంది.
- స్రీన్పైనే ఫింగర్ స్కానర్:
కనిపించని కెమెరాతో అదిరే సెల్ఫీ
ఫోన్లలో ఫింగర్ ప్రింట్ స్కానర్ వెనుక భాగంలో లేదా ముందు భాగంలో అమర్చుతారు. కానీ గెలాక్సీ ఏ90 లో ఆ పరికరమే కనిపించదు కానీ పనిచేస్తుంది. సెన్సార్ల ఆధారంగా స్రీన్ పైనే స్కానర్ ఏర్పాటు చేస్తున్నారట.
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తోనే పనిచేసే శాంసంగ్ ఏ90 స్నాప్ డ్రాగన్ 710 ప్రాసెసర్ కలిగి ఉంటుందట. 6జీబీ, 8జీబీ వేరియంట్లతో 128 జీబీ స్టోరేజ్ కలిగి ఉండే అవకాశం ఉంది. ఇన్ని ఫీచర్లు ఉన్న చరవాణిని శాంసంగ్ సంస్థ మార్కెట్లోకి విడుదల చేసే వరకు గాడ్జెట్ ప్రియులు ఎదురుచూడాల్సిందే.