తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

నోరూరించే చాక్లెట్​తో.. మైమరిపించే అందం! - chocolate face pack

చాక్లెట్​ అంటే ఇష్టముండని వారెవరూ ఉండరు. నోరూరించే చాక్లెట్​తో ఒత్తిడి దూరమవడమే కాదు అందాన్నీ మెరుగుపరుచుకోవచ్చని తెలుసా? అదెలాగంటే..

chocolate-face-pack
అందానికి చాక్లెట్ పూత

By

Published : Sep 24, 2020, 3:14 PM IST

చాక్లెట్‌ను కరిగించి దానికి చెంచా తేనె, కొద్దిగా రోజ్‌ వాటర్‌ కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూత వేసుకోవాలి. అరగంటయ్యాక గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేయాలి. ఇలా చేస్తే దీనిలోని యాంటీఆక్సిడెంట్లు ...చర్మాన్ని నిగారింపుతో కనిపించేలా చేస్తాయి.

ముఖంపై ముడతలు రాకుండా... చాక్లెట్‌ను కరిగించి, దానికి చెంచా పాలపొడి, రెండు చెంచాల నిమ్మరసం, కొద్దిగా ఆలివ్‌ నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు రాసుకుని ఆరనివ్వాలి. చివరగా గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకుంటే చాలు. మీ సమస్య దూరమవుతుంది. చర్మం తాజాగా కనిపిస్తుంది.

చర్మం నిర్జీవంగా కనిపిస్తున్నప్పుడు ఇలా చేయండి. అరకప్పు చాక్లెట్‌పొడిలో కాసిన్ని పాలు, కొద్దిగా తేనె, చెంచా పెసరపిండి కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆపై రెండు నిమిషాలాగి చేతుల్ని తడిపి మునివేళ్లతో మృదువుగా సవ్య, అపసవ్య దిశల్లో రుద్దాలి. అప్పుడు చర్మంపై మృతకణాలు తొలగి కళగా కనిపిస్తారు.

ABOUT THE AUTHOR

...view details