మీరు రోజూ రాత్రి పడుకునే సమయంలో కూడా బ్రా వేసుకునే నిద్రపోతారా? అయితే అలవాటును ఇక నుంచైనా మానుకోవాలి. బిగుతుగా ఉండే దీని స్ట్రైప్స్ వల్ల రక్తసరఫరా సరిగా జరగదు. దాంతో గుండెలో నొప్పి రావొచ్చు. అలాగే ఛాతి కింద చర్మం ఎర్రగా మారడం, మంట పుట్టడం, దురద... లాంటి లక్షణాలు కనిపించవచ్చు. బిగుతుగా ఉండే వాటిని ధరించడం వల్ల రొమ్ములో ఉండే కణజాలం దెబ్బ తింటుంది. ఇది భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు రావడానికి కారణం కావొచ్చు. కాబట్టి నిద్రపోయే సమయంలో దీన్ని వేసుకోకపోవడమే మంచిది.
బిగుతుగా ఉండే దుస్తులు..
రాత్రి పడుకునే సమయంలో వదులుగా ఉండే దుస్తులను మాత్రమే ధరించాలి. అప్పుడే రక్త ప్రసరణ సాఫీగా సరిగా జరుగుతుంది ఉదయం నుంచి వేసుకున్న దుస్తులు చెమట, దుమ్ము, హానికారక సూక్ష్మజీవులు నిండి ఉంటాయి. వీటితోనే నిద్రపోతే జబ్బులొస్తాయి. కాబట్టి వీటిని తొలగించి వదు లాగా ఉండే నైట్ డ్రెస్ వేసుకోవాలి.
లోదుస్తులు
వీటిని ధరించి నిద్రపోవడం వల్ల వ్యక్తిగత భాగాల్లో అసౌకర్యంగా ఉంటుంది. అధిక తేమ, వేడి వల్ల అక్కడ ఫంగల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.