తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

మీ ముఖ సౌందర్యానికి తామర పూల పొడి!

అందంగా.. చూడచక్కగా ఉండే కమలం.. సౌందర్య పోషణకూ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే తామర పూలు ఎక్కడపడితే అక్కడ దొరకవు కదా... ఏం చేయాలా అని ఆలోచించాల్సిన పనిలేదు. ఈ పూల పొడి మార్కెట్లో అందుబాటులో ఉంది. దీన్ని ఉపయోగించి అందానికి మెరుగులు దిద్దుకోవచ్చు.

use lotus flower powder mask for glowing skin
మీ ముఖ సౌందర్యానికి తామర పూల పొడి!

By

Published : Oct 1, 2020, 10:58 AM IST

  • రెండు టేబుల్‌స్పూన్ల తామరపూల పొడిలో టేబుల్‌స్పూన్‌ పాలు కలపాలి. దీన్ని ముఖం, మెడకు పట్టించి పావుగంట పాటు ఆరనివ్వాలి. తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల ముఖం మృదువుగా మారడమే కాకుండా చక్కగా మెరిసిపోతుంది కూడా.

జుట్టు సంరక్షణకు:

  • జుట్టు పొడిబారిపోకుండా ఉండటానికి, వెంట్రుకలు పెరగడానికి తామర పూల పొడి ఎంతో ఉపయోగపడుతుంది. దీని కోసం ఏం చేయాలంటే... తామర పూలపొడి, ఉసిరిపొడి, గుంటగలగర ఆకు పొడిని రెండు టేబుల్‌స్పూన్ల చొప్పున తీసుకుని నీళ్లతో కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకూ పట్టించాలి. అరగంట తరువాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. వారానికోసారి ఇలా చేయడం వల్ల చుండ్రు దరిచేరదు. జుట్టు ఊడటమూ తగ్గుతుంది.

ABOUT THE AUTHOR

...view details