ఆముదం:
ఇందులో ఉండే ప్రొటీన్లు, ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు కనుబొమలకు తగిన పోషణ అందిస్తాయి. ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. రోజూ రాత్రి పడుకునే ముందు రెండు చుక్కల ఆముదాన్ని కనుబొమలకు రాసి మృదువుగా మర్దనా చేయాలి. తరచూ ఇలా చేస్తే ఒత్తుగా ఎదుగుతాయి.
కొబ్బరి నూనె:
కండిషనర్‌లానే కాకుండా మాయిశ్చరైజర్‌లానూ ఇది పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఇ, ఇనుము వెంట్రుకలు ఆరోగ్యంగా ఎదిగేందుకు తోడ్పడతాయి. పడుకునే ముందు కొబ్బరి నూనెలో దూది ముంచి కనుబొమలకు అద్దండి.. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది.