- పాలమీగడలో రెండు చుక్కల నిమ్మరసం కలిపి రోజూ స్నానానికి వెళ్లే ముందు రాసుకోవాలి. కాసేపయ్యాక కాస్త పెసర పిండిలో గులాబీ నీళ్లు కలిపి ఒంటికి పట్టించి నలుగు పెట్టుకుని స్నానం చేస్తే... మచ్చలు, మొటిమలు తగ్గి ముఖం కాంతులీనుతుంది.
- కీరదోస, నిమ్మరసాన్ని సమపాళ్లలో తీసుకుని దానికి చిటికెడు పసుపు కలుపు కోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ ఉదయాన్నే ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తరవాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే క్రమంగా చర్మఛాయ మెరుగుపడుతుంది.
- పెరుగు... క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇది డీహైడ్రేషన్‌కి గురికాకుండా కాపాడుతుంది. దాంతో పాటు పెరుగులో రెండు కుంకుమ పువ్వు రేకలు వేసి పెదాలకు రాయండి. కాసేపాగి కడిగేస్తే తేమగా, తాజాగా కనిపిస్తాయి.
- రెండు చెంచాల నిమ్మరసంతో చెంచా తేనె, కోడిగుడ్డులోని తెల్లసొన వేసి బాగా గిలకొట్టాలి. దీన్ని ముఖం, మెడ, చేతులకు రాసుకుంటే... నలుపు తగ్గుతుంది. చర్మం బిగుతుగా మారుతుంది.
- చుండ్రు ఇబ్బంది పెడుతున్నప్పుడు నిమ్మరసంలో రెండు చుక్కల ఆలివ్ నూనె కలిపి తలకు పట్టించి మర్దన చేయాలి. ఆపై తలకు ఆవిరి పట్టి గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే సరి. వెంట్రుకలు నిగనిగలాడతాయి.
- వేళ తప్పిన నిద్రా, తిండీ అధిక బరువు పెరిగేలా చేస్తాయి. దాన్ని అదుపులో ఉంచడానికి కరివేపాకులోని పోషకాలు కీలకంగా పనిచేస్తాయట. అలానే ఫోలిక్‌యాసిడ్, ఇనుమూ, క్యాల్షియం వంటి ఖనిజాలు, పోషకాలు సమపాళ్లలో శరీరానికి అందినప్పుడు జుట్టు రాలడం తగ్గుతుంది.
- పియర్స్, అవకాడో, స్ట్రాబెర్రీ, యాపిల్స్, అవిసె గింజలు, బీన్స్, క్యారట్స్, బ్రకలీ.. వంటి వాటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల చర్మం నవయవ్వనంగా మారుతుంది.. మెరుపును సంతరించుకుంటుంది.
మీకు తెలుసా...? తులసితో తళతళలాడే అందం!
- బియ్యం పిండి కలిపి.. పావుకప్పు బియ్యప్పిండిలో చెంచా చొప్పున పెరుగు, నిమ్మరసం, రెండు చెంచాల కొత్తిమీర ముద్దను కలపాలి. దీన్ని ముఖానికి రాసి ఆరాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేస్తే ముఖంలోని కండరాలు, కణాలపై ఒత్తిడి తగ్గి తాజాగా మారుతుంది.
- బీట్‌రూట్ రసంలో రెండు చుక్కల చొప్పున తేనె, నిమ్మరసం కలిపి రాసుకుంటే పెదాలు తాజాగా, వర్ణరంజితంగా మారతాయి.
- కొద్దిగా ఆలివ్ నూనెలో పావు కప్పు టొమాటో పేస్ట్‌ను కలుపుకొని రోజూ తీసుకోవడం వల్ల సూర్యరశ్మి వల్ల చర్మం కందిపోకుండా జాగ్రత్తపడచ్చు.
- బంగాళాదుంపను మెత్తగా చేసుకొని చర్మంపై ఎండ తగిలే ప్రదేశంలో రాస్తే సరి.. అంతేకాదు.. ఇది మేని మెరుపుకూ ఉపయోగపడుతుంది.
- కీరాదోస ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగించి చల్లదనాన్ని ఇవ్వడం మాత్రమే కాదు.. సూర్యరశ్మి నుంచి కూడా చర్మాన్ని కాపాడుతుంది. అందులో అధికంగా ఉండే నీటి శాతమే దీనికి కారణం.
- క్యారట్లు, చిలగడదుంపలో ఉండే బీటా కెరోటిన్ కూడా సూర్యరశ్మి ప్రభావం శరీరంపై పడకుండా కాపాడుతుంది.
- కొంతమంది సలాడ్లు తినడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటివారు బాదం, పొద్దుతిరుగుడు విత్తనాలు.. వంటివి సలాడ్లలో భాగం చేసుకోవాలి. ఫలితంగా వీటిలో ఉండే విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు.. వంటివన్నీ ఎండ వల్ల చర్మం కందిపోకుండా రక్షిస్తాయి.
- ముదురు రంగుల్లో ఉండే కూరగాయలు, ఆకుకూరల్ని సైతం ఆహారంలో భాగం చేసుకోవాలి. తద్వారా ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు.. ఫ్రీరాడికల్ డ్యామేజ్ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి.
- వీటన్నింటితో పాటు కలబంద, ఓట్స్, మజ్జిగ.. వంటివి కూడా ఎండ కారణంగా చర్మం కందిపోకుండా సంరక్షిస్తాయి. కాబట్టి మీరూ వీటన్నింటినీ మీ ఆహారంలో భాగం చేసుకోవడం లేదంటే చర్మానికి అప్త్లె చేసుకోవడం.. వంటివి చేస్తే ఎండ నుంచి రక్షణ పొందచ్చు.