హ్యాండు బ్యాగులు, గాజులు, చెవిపోగులు... ఇతరత్రా ఫ్యాషన్ వస్తువులన్నీ దాదాపుగా ప్లాస్టిక్, లెదర్ లేదా సింథటిక్‌తో తయారయ్యేవే. ఇవి భూమిలో కలవడానికి ఎన్నో ఏళ్లు పడతాయి. తరచూ మారే మన ఫ్యాషన్ ట్రెండులు పర్యావరణానికి హానిచేయకుండా ఉండాలంటే ‘సస్టెయినబుల్’ మంత్రాన్ని పాటించాల్సిందే అంటున్నారు నిపుణులు.
ఎకో ఫ్రెండ్లీయే.. నయా ఫ్యాషన్ ట్రెండ్! - sustainable fashion accessories
ఫ్యాషన్ వస్తువులన్నీ దాదాపుగా ప్లాస్టిక్, లెదర్, సింథటిక్‌తో తయారవుతాయి. వీటివల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది. అలా జరగకూడదంటే సస్టెయినబుల్ మంత్రాన్ని పాటించాలంటున్నారు నిపుణులు.
ఎకో ఫ్రెండ్లీ యాక్సెసరీస్, సస్టెయినబుల్ యాక్సెసరీస్
పైనాపిల్ పీచు, చెట్ల వ్యర్థాల నుంచి తయారైన బెండుతో చెవిపోగులు, కళ్లద్దాలు, బ్యాగులు, చెప్పులు, బ్రేస్‌లెట్లు ఇలా ఒకటేమిటి ఎన్నో తయారుచేస్తున్నారు. తేలికగా, వాడకానికి అనువుగా ఉండే వీటికి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది.
- ఇదీ చదవండినయా లుక్తో ఆకట్టుకుంటున్న నాజూకు నగలు