‘హౌస్‌దట్’ నేహా భండారి... ‘దుస్తులు లేదా వస్తువుల్లో పాతబడినవి, వాడనివి అనేకం ఉంటాయి. వాటిని తీసేస్తే ఇల్లు అందంగా, హాయిగా ఉంటుంది’ అంటుంది. ‘ది ఆటిక్ లై’ నిపుణురాలు నికితా రాయ్‌క్వార్ ‘మనం ఉపయోగించని, పనికి రానివి తీసేయడం వల్ల ఇల్లు కళగా ఉంటుంది. పనికొచ్చేవే ఉంటే చప్పున కనిపిస్తాయి కూడా’ అంటుంది.
ఇంకా ఏం చెబుతున్నారు?
జూ కుర్తీ, పైజమా, స్కార్ఫ్ లాంటివి ఒక దగ్గర లేకుంటే వాటిని వెతుక్కోవాలి. దొరక్కపోతే చిరాకు, ఆందోళన. దుస్తులు ఎక్కువెక్కువగా కిక్కిరిసి, గజిబిజిగా ఉంటే ఏది వేసుకోవాలో అర్థంకాదు. అవసరమైనవి మాత్రమే ఉంటే హాయిగా ఉంటుంది. వాడనివి తీసేయడం, తక్కినని నీట్‌గా సర్దడంతో ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి. ప్రశాంతంగా ఉంటుంది.
* పండుగలప్పుడు శుభ్రం చేస్తారు, స్థల మార్పిడి చేస్తారు. వాటితో పాటు తగ్గించే పని మీద దృష్టిపెట్టాలి.
* మీరే సర్దేట్లయితే ఒక్కసారే మొత్తం పూర్తి చేయాలనుకోవద్దు. రోజుకో భాగం చొప్పున విభజించుకుంటే సులువు.
* వార్డ్‌రోబ్స్‌కు మేరీ కొండో చెప్పిన ‘కోన్‌మేరీ’ పద్ధతి బాగుంటుంది. అంటే.. ముందు దుస్తులు, తర్వాత పుస్తకాలు.. అప్పుడు విసుగు లేకపోగా సరదాగా పనైపోతుంది.
* పర్సులు, మొబైల్స్ లాంటివి తలుపు దగ్గర్లో, వంట గిన్నెలు సింక్‌కు దగ్గరగా ఉంటే అందుకోవడం సుఖం.
* ఆయా వస్తువులను డబ్బాల్లో, పెట్టెల్లో అమర్చడం వల్ల అడ్డంగానూ ఉండవు, చూట్టానికీ బాగుంటుంది.
* మన అవసరాలు, ఆలోచనలు, ఏం కావాలి, ఎలా ఉంటే బాగుంటుంది, ఏవయితే సులువు, సౌఖ్యం లాంటి విషయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. చాలా మంది పండగలకు పాతబడిన వాటిని తీసేసి కొత్తవాటితో అలంకరిస్తారు. ఎన్నో తర్జన భర్జనల తర్వాత కొన్నింటిని వదిలేస్తారు. అందుకే నిమిషాల్లో అంచనా చేసి తొలగించాల్సిన జాబితా, దేన్నెక్కడ అమర్చాలో క్షణాల్లో నిర్ణయం తీసుకోవాలి.
* పక్కన పెట్టిన వస్తువును చివరి సారిగా ఎన్నాళ్ల క్రితం వాడామో గుర్తు చేసుకుంటే చాలు... దాని అవసరం ఏంటో తెలిసిపోతుంది. అప్పుడు నిర్ణయం తీసుకోవడం తేలిక.
ఇదీ చూడండి: ఇవి పాటించండి.. మీ మేధాశక్తిని మరింత పెంచుకోండి..!