తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

గులాబీ నూనెతో మీ చర్మాన్ని, జుట్టును మెరిపించేయండిలా! - చర్మం మెరిసేందుకు గులాబీ నూనె

సాధారణంగా రోజ్‌ ఆయిల్‌ను అరోమాథెరపీలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీన్ని చర్మ, జుట్టు సంరక్షణకు వాడితే ఎన్నో ఉపయోగాలు. అవేంటంటే..

rose oil tips to glow your face
గులాబీ నూనెతో మీ చర్మాన్ని, జుట్టును మెరిపించేయండిలా!

By

Published : Sep 18, 2020, 2:26 PM IST

గులాబీ నూనెకు యాంటీసెప్టిక్‌, యాస్ట్రిజెంట్‌ గుణాలు ఎక్కువ. వేడినీటిలో కాస్త రోజ్‌ ఆయిల్‌ని వేసి ఆవిరి పట్టడం వల్ల చర్మ రంధ్రాలు శుభ్రపడతాయి. చర్మం తేమగా ఉండటమే కాదు ఛాయా మెరుగుపడుతుంది.

వెన్న, బ్రౌన్‌ షుగర్‌ కలిపి దానికి రెండు చుక్కల రోజ్‌ ఆయిల్‌ చేర్చండి. ఈ మిశ్రమాన్ని ఒంటికి రాసుకుని నలుగులా రుద్దాలి. ఇది సహజసిద్ధమైన స్క్రబ్‌లా పనిచేస్తుంది. ఇందులోని యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ గుణాలు చర్మ సంబంధిత సమస్యల్ని దూరం చేస్తాయి. మొటిమలూ తగ్గుతాయి.

టేబుల్‌ స్పూన్‌ ఆలివ్‌ నూనెలో కొన్ని చుక్కల రోజ్‌ ఆయిల్‌ని కలిపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించాలి. కాసేపయ్యాక కడిగేయాలి. ఇలా చేయడం వల్ల మీ జుట్టు సహజ తేమను పొంది, బలంగా మారుతుంది.

ఇదీ చదవండిఃకరోనా కారణంగా పరిమితంగానే బస్సు సర్వీసులు

ABOUT THE AUTHOR

...view details