సరికొత్త డిజైన్లతో లైఫ్‌స్టైల్ బ్రైడల్ ఫ్యాషన్ షో ఆధునిక హంగులతో హుందాగా తయారుచేసిన చీరలంటేనే ప్రస్తుతకాలంలోని మహిళలకు ఇష్టం. వైవిధ్యమైన డిజైన్లు, ఆకట్టుకునే వర్ణాల్లో ఉండే చీరలే వారి మనసును దోచుకుంటాయి. చీరలంటే అంత మక్కువ కాబట్టే... రోజుకోరకం డిజైన్లు మార్కెట్లలోకి వస్తుంటాయి. ఒకదానిమించి మరొకటి విభిన్న రూపాల్లో వారిని ఆకర్షిస్తాయి. హైదరాబాద్ మహిళలకు సరికొత్త డిజైన్లతో కూడిన చీరలను పరిచయం చేస్తూ... హైటెక్స్‌లో ఔత్సాహిక మహిళా వ్యాపారుల సమాఖ్య ఆధ్వర్యంలో లైఫ్‌స్టైల్ బ్రైడల్ ఫ్యాషన్ షో నిర్వహించారు.
మోడల్స్ ప్రదర్శన
ప్రకృతిలోని రంగులు, ఆకర్షించే డిజైన్లు, అబ్బురపరిచే హంగులతో నేసిన పట్టుచీరలను ధరించి కళ్లు జిగేలుమనేలా మోడల్స్ ప్రదర్శించారు. సంప్రదాయ వస్త్రాలు, ఆభరణాలను భాగ్యనగర ఫ్యాషన్ ప్రియులకు పరిచయం చేశారు. వెలుగు దివ్వెలతో పోటీపడుతూ... తమ ప్రదర్శనతో హొయలొలికించారు.
ర్యాంప్‌వాక్
ప్రముఖ సినీ కథానాయిక శ్రద్ధాదాస్ ఫ్యాషన్ షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలించారు. సంప్రదాయ దుస్తులు ధరించి మోడల్స్‌తో కలిసి ర్యాంప్‌వాక్ చేశారు. తొలిసారిగా పట్టుచీర కట్టుకుని ర్యాంప్‌పై వాక్ చేయడం ఆనందంగా ఉందన్నారు.
ఇదీ చూడండి :ఘనంగా ఆటా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు