కొబ్బరి నూనెతో...
కొబ్బరి నూనెలో విటమిన్-ఇ గుణాలు ఎక్కువ. దీన్ని వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒంటికి రాయండి. ఆపై మృదువుగా కాసేపు మర్దనా చేయండి. ఇలా చేస్తే పొడిబారి పగిలిన చర్మం త్వరగా సాధారణ స్థితికి వస్తుంది. ఈ నూనెకు ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాల వల్ల చర్మ సంబంధిత సమస్యలూ దరిచేరవు. వయసు పైబడడం వల్ల వచ్చే ముడతలు త్వరగా రావు. కళ్ల చుట్టూ ఉండే నల్లటి వలయాలు తగ్గుతాయి. కొబ్బరి నూనెను తలకు రాసుకొని మర్దనా చేయడం వల్ల వెంట్రుకలు త్వరగా రంగు మారవు. జుట్టు ఒత్తుగా పెరగడానికీ ఇది ఉపయోగపడుతుంది.