తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

వజ్ర సోయగం.. కళ్లుచెదిరే సరికొత్త బ్రైడల్​ కలెక్షన్ - సరికొత్త బ్రైడల్​ కలెక్షన్స్​

హైదరాబాద్​ జూబ్లీహిల్స్​లోని ది డైమండ్​ స్టోర్స్​... సరికొత్త బ్రైడల్​ కలెక్షన్​ను అందుబాటులోకి తెచ్చింది. కళ్లు చెదిరేలా రూపొందించిన డైమండ్​ ఆభరణాల్లో మోడల్స్​ చేసిన ప్యాషన్​ షో... ఆకట్టుకుంది.

new diamond jewellary collections from the diamond store hyderabad
new diamond jewellary collections from the diamond store hyderabad

By

Published : Jan 5, 2021, 6:47 PM IST

Updated : Jan 5, 2021, 7:25 PM IST

హైదరాబాద్‌లో జరిగిన డైమండ్స్‌ ఆభరణాల ప్రదర్శన ఆకట్టుకుంది. కళ్లు చెదిరే డైమండ్‌ ఆభరణాల్లో మోడల్స్‌ తళుక్కున మెరిశారు. బ్రైడల్‌ కలెక్షన్‌తో మోడల్స్‌ చేసిన ఫ్యాషన్‌ షో ఆకట్టుకుంది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని "ది డైమండ్‌ స్టోర్‌"లో... రాబోయే సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని సరికొత్త బ్రైడల్‌ కలెక్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ది డైమండ్​ స్టోర్​లో కళ్లుచెదిరే సరికొత్త బ్రైడల్​ కలెక్షన్స్​

పెళ్లిళ్ల సీజన్ కోసం ప్రత్యేకంగా చోకర్స్, హారాలు, జూకాలు, వడ్డాణాలతో బ్రైడల్ సెట్స్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ది డైమండ్‌ స్టోర్‌ ఎండీ శ్రీకాంత్‌ తెలిపారు. దక్షిణ భారతీయ ఆభరణాల ప్రియుల అభిరుచులకు తగిన విధంగా సరికొత్త డిజైన్లను రూపొందించామన్నారు. మధ్య తరగతి వారికి సైతం అందుబాటు ధరలో లభించేలా ఆభరణాలు తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: మరింత పెరిగిన బంగారం, వెండి ధరలు

Last Updated : Jan 5, 2021, 7:25 PM IST

ABOUT THE AUTHOR

...view details