కొంతమంది జుట్టు చిట్లిపోయి పొడిబారి నిర్జీవంగా కనిపిస్తుంది. ఈ వర్షాకాలం ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
- కప్పు నానబెట్టిన మెంతులు, కాస్త వేపాకు, కరివేపాకు కలిపి రుబ్బాలి. ఆ పేస్టును కొబ్బరి నూనెలో బాగా మరగనివ్వాలి. అది గోరు వెచ్చగా ఉన్నప్పుడు తలకు పట్టించి మర్దనా చేయాలి. అరగంటాగి తలస్నానం చేస్తే... చుండ్రు ఇబ్బంది తగ్గుతుంది.
- సమపాళ్లలో తీసుకున్న ఆముదం, కొబ్బరి నూనె మిశ్రమంలో పావుకప్పు మెంతులు వేసి మరిగించాలి. చల్లారాక అందులో రెండు చుక్కల లావెండర్ నూనె కలిపి తలకు పట్టించి మునివేళ్లతో మాడుని రుద్దాలి. ఇలా చేస్తే రక్తప్రసరణ మెరుగవుతుంది. జుట్టు పెరిగేలా ఫాలికల్స్ పునరుత్తేజం చెందుతాయి.
- జుట్టు మరీ పల్చగా, మెరుపు తగ్గిపోయి ఇబ్బంది పెడుతుంటే... ఆవనూనెలో గుడ్డు తెల్లసొన కలిపి బాగా గిలకొట్టాలి. ఆపై అరచెక్క నిమ్మరసం పిండి వెంట్రుకలకు పట్టించాలి. పూర్తిగా ఆరాక తర్వాత తలస్నానం చేయాలి. గుడ్డులోని విటమిన్లూ, మినరల్స్ తలకి పట్టి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.