తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

అందుబాటులో ఉన్న వస్తువులతోనే అందంగా తయారవ్వండిలా! - glowing skin with rice flour

మీకు అందుబాటులో ఉన్న పదార్థాలతో తక్కువ సమయంలో మీ మోము మెరిసిపోవాలనుకుంటున్నారా.. ఇలా ప్రయత్నించి చూడండి....

making skin glowing with homemade resources
అందుబాటులో ఉన్న వస్తువులతోనే అందంగా తయారవ్వండిలా..!

By

Published : Oct 7, 2020, 8:11 AM IST

  • ఫేస్​ప్యాక్

చెంచా కమలాతొక్కల పొడికి రెండు చెంచాల పాలు కలిపి మెత్తగా చేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఆరిన తరువాత చల్లటి నీటితో కడిగేస్తే సరి. కమలా తొక్కల పొడి ట్యాన్‌ను తగ్గించి మీ ముఖాన్ని తాజాగా, కాంతిమంతంగా మెరిసిపోయేలా చేస్తుంది. ఇలా తరచూచేస్తూ ఉంటే మీ మోము ఎల్లప్పుడూ చక్కగా మెరిసిపోతుంది.

  • క్లెన్సింగ్

ఓ పావు కప్పు పాలు తీసుకోవాలి. చిన్న దూది ఉండను పాలలో ముంచి ముఖాన్ని పూర్తిగా తుడుచుకోవాలి. ఇలాచేస్తే ముఖంపై పేరుకుపోయిన మురికి మొత్తం తొలగిపోతుంది.

  • స్క్రబ్బింగ్

దీనికోసం ఓ గిన్నెలో చెంచా బియ్యప్పిండి తీసుకోవాలి. దీనిలో రెండు చెంచాల పాలు పోసి ఉండలులేకుండా బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసుకోవాలి. ఆ తరువాత చెంపలు, నుదురు భాగంలో మృదువుగా వృత్తాకారంలో మర్దనా చేయాలి. ఇది ఆరే వరకు అలాగే ఉండాలి. దీన్ని కడిగేసుకుని ముఖం శుభ్రంగా తుడుచుకోవాలి. పాలలోని పోషకాలు మీ చర్మాన్ని మెరిపిస్తాయి. బియ్యప్పిండి చర్మంపై పేరుకున్న మృతకణాలను తొలగిస్తుంది.

ఇదీ చదవండిఃదాల్చినచెక్కతో ఫేస్‌ప్యాక్‌ వేసుకోవచ్చా?

ABOUT THE AUTHOR

...view details