- వ్యాయామం చేసేటప్పుడు... ఫాండేషన్ లేదా దట్టమైన మేకప్‌ను అస్సలు వేసుకోవద్దు. వ్యాయామం చేసేటప్పుడు వచ్చే చెమట వీటివల్ల బయటకు రాలేదు. దాంతో చర్మరంధ్రాలు మూసుకుపోతాయి. ఫలితంగా చర్మసమస్యలు మొదలుతాయి.
- ఈత తరువాత ముఖాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోకుండా మేకప్ వేసుకుంటే ముఖం ఉబ్బడం, స్కిన్ రియాక్షన్స్ వంటివి వస్తాయి. అందుకే స్విమ్మింగ్ తరువాత ముఖాన్ని నాణ్యమైన ఫేస్‌వాష్‌తో శుభ్రం చేసుకోవాలి. కనీసం ఫేస్ వైప్స్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకున్న తరువాతే మేకప్ వేసుకోవాలి.
- లేజర్ హెయిర్ రిమూవల్ చికిత్సలను చేయించుకోవాలనుకునేవారు మూడు నాలుగు రోజుల ముందు నుంచే మేకప్‌కు దూరంగా ఉండాలి. అలాగే చికిత్స చేయించుకున్న తరువాత కూడా చర్మం సెన్సిటివ్‌గా ఉంటుంది. అలంకరణ కోసం.. కొంతకాలం ఆగాల్సిందే!
ఆ సందర్భాల్లో అలంకరణ అస్సలొద్దు...! - Makeup tips in telugu
ప్రత్యేక అలంకరణ ఎప్పుడు చేసుకోవాలో మనకు తెలుసు. కానీ వేసుకోకూడని సందర్భాలు కూడా కొన్ని ఉంటాయని తెలుసా? ఇంతకీ ఏంటా సందర్భాలు?
ఆ సందర్భాల్లో అలంకరణ అస్సలొద్దు...!