ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితాను విడుదలైంది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్ల సంఖ్య 2,153. ఇందులో యువకులు 71 మంది. వీరందరిలో 41 మంది శ్రీమంతులకు ఓ ప్రత్యేకత ఉంది. వీరంతా స్వయంకృషితో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా ధనికులయ్యారు. వీరిలో 40 మంది పురుషులైతే...ఒక్కతే మహిళ. ఆమె కైలీ జెన్నర్.
ఎవరీ కైలీ...?
కైలీ జెన్నర్ 'కైలీ కాస్మోటిక్స్' సంస్థ అధినేత్రి. సౌందర్యలేపనాల వ్యాపారంలోకి అడుగుపెట్టకముందే జెన్నర్ కర్దార్శియన్ స్టార్‌గా ప్రఖ్యాతి. 2015లో ప్రారంభించిన కైలీ కాస్మోటిక్స్ బిజినెస్ కేవలం నాలుగేళ్లలోనే ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. అదే ఆమె వ్యాపారాన్ని 900 మిలియన్ డాలర్ల సామ్రాజ్యానికి అధినాయకురాలని చేసింది.
సామాజిక మాధ్యమాలనే తన వ్యాపార విస్తరణకు అనుకూలంగా మార్చుకుని మిలీనియల్ అని నిరూపించుకుంది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, స్నాప్‌చాట్‌లో కైలీని ఫాలో అయ్యేవారు 17కోట్ల పైమాటే. తన ఉత్పత్తులకు తనే బ్రాండ్ అంబాసిడర్.
సక్సెస్ మంత్ర..?
కైలీ కాస్మోటిక్స్ వ్యాపారమంతా అవుట్సోర్సింగ్ పైనే ఆధారపడుతుంది. ఉత్పత్తుల తయారీ, ప్యాకేజీ, రవాణాను వివిధ సంస్థలకు అప్పగించారు కైలీ. సంస్థలో సిబ్బంది ఏడుగురే అయితే, మరో 5గురు పార్ట్ టైం ఉద్యోగులు. గత కొద్దిరోజుల క్రితం వరకు కేవలం అంతర్జాలం ద్వారానే సౌందర్యలేపనాలను వినియోగదారులకు చేరవేసేవారు. ఆన్లైన్లో కొత్త వస్తువులను పెట్టిన నిమిషంలోనే స్టాక్ అయిపోయేవి. ప్రస్తుతం అమెరికాలోని 50 రాష్ట్రాల్లో ఆల్ట్రా బ్యూటీ స్టోర్లను నెలకొల్పారు. ఆ బ్యూటీ స్టోర్లు తెరిచిన గంటలోపే యువత ఎగబడి షాపులను ఖాళీ చేశారంటే అమెరికాలో ఆమెకున్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.
ఇవీ చూడండి:'వనిత' కోసం సైకతశిల్పం