పోచంపల్లి చీరలపై రష్యన్, ఉక్రెయిన్ జానపద కళ జాలువారినట్టుగా ఉండే.. నూతన వస్త్రశ్రేణిని... ‘మిషా..ఇన్ మిన్క్స్’ కలెక్షన్ పేరిట తీసుకువచ్చింది మీ కళాంజలి. వీటిని ఫార్మల్, ఆఫీస్‌వేర్‌గానూ వాడుకోవచ్చు. ఇంకా స్టైలిష్ లుక్ కావాలంటే.. జీన్స్‌కు జతగానూ వేసి రెట్రో స్టైల్‌లో భిన్నంగా కనిపించొచ్చు.
జానపదకళ జాలువారిన.. మిషా.. ఇన్ మిన్క్స్
అందమైన ఊహలకు అద్భుతమైన రూపం ఇస్తే... ఇదిగో ఇలా పోచంపల్లి చీరలపై రష్యన్, ఉక్రెయిన్ జానపద కళ జాలువారినట్టుగా ఉంటుంది. ఈ నూతన వస్త్రశ్రేణిని... ‘మిషా..ఇన్ మిన్క్స్’ కలెక్షన్ పేరిట తీసుకువచ్చింది మీ కళాంజలి. వీటిని ఫార్మల్, ఆఫీస్‌వేర్‌గానూ వాడుకోవచ్చు. ఇంకా స్టైలిష్ లుక్ కావాలంటే.. జీన్స్‌కు జతగానూ వేసి రెట్రో స్టైల్‌లో భిన్నంగా కనిపించొచ్చు.
మిషా.. ఇన్ మిన్క్స్
బూడిద రంగు చీరపై పక్షులూ, పూలు.. నీలం రంగు అంచూ అదిరిపోయాయి. వైవిధ్యంగా జీన్స్ మీద కట్టిన చీర మీకూ నచ్చిందా మరి.
ప్రకాశవంతమైన ఆకుపచ్చని చీరకు నారింజ రంగు అంచు జతకలిస్తే.. ఆ అందాన్ని గురించి కొత్తగా చెప్పేదే ముంది.