ఫ్యాషన్‌పై ఆసక్తి ఉన్నవారిని ప్రోత్సహించేందుకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో నిర్వహించిన కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. "మిస్ అండ్ మిస్టర్‌సో స్టార్" పేరిట నిర్వహించిన అడిషన్స్ కార్యక్రమంలో నిర్వహించిన ఫ్యాషన్‌షో మంత్రముగ్ధులను చేసింది. ఆ అడిషన్స్‌కు హైదరాబాద్‌లోని పలువురు అందమైన అమ్మాయిలు, అబ్బాయిలు పాల్గొని తమ అందం, అభినయంతో అలరించారు.
అందం, అభినయంతో ఆకట్టుకున్న సుందరాంగులు - Hyderabad latest news
అందమైన సుందరాంగులు...... తమ అందచందలతో ఆకట్టుకున్నారు. ర్యాంప్‌పై హంసనడకలతో అదరహో అనిపించారు. ఫ్యాషన్ రంగంపై ఆసక్తి ఉన్న యువతి, యువకులను ప్రోత్సహించే లక్ష్యంతో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓ హోటల్‌లో... "మిస్ అండ్ మిస్టర్‌సో స్టార్" పేరిట నిర్వహించిన అడిషన్స్ కార్యక్రమం కలర్‌పుల్‌గా సాగింది.
అందం, అభినయంతో ఆకట్టుకున్న సుందరాంగులు
కరోనా కారణంగా కేవలం హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలోనే అడిషన్స్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అన్ని నగరాల్లో ఆడిషన్స్ నిర్వహించాక హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఫైనల్స్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఫ్యాషన్‌షో ఆద్యంతం అలరించింది. పలువురు అమ్మాయిలు వయ్యారంగా ర్యాంప్‌పై క్యాట్ వాక్‌తో అదుర్స్ అనిపించారు.
ఇదీ చదవండి: యాదాద్రిలో ముగిసిన రామానుజుల ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు