తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

'స్మార్ట్​వాచీ'లందు ఈ వాచీ వేరయా..! - latest smart watches in the market

మామూలుగా అయితే వాచీలో టైం చూస్తాం.. కానీ ఈ వాచీలో మాత్రం టైంతో పాటు సూర్యచంద్రులూ కనిపిస్తారు. అవునండీ.. వినేందుకు కొత్తగా ఉన్నా.. ఇది నిజం. కావాలంటే ఆ వాచీని మీరూ ఓసారి ట్రై చేయండి..

hyper Ayaan smart watch
హైపర్​ అయాన్​ స్మార్ట్​ వాచ్​

By

Published : Mar 28, 2021, 8:00 PM IST

స్మార్ట్‌వాచీల్లో ఫీచర్లు బాగుంటాయి. కానీ సమయంతో పాటు, చేతికి అందంగా ఫ్యాషన్‌గా ఉండాలనుకునేవాళ్లు అనలాగ్‌ వాచీలను పెట్టుకునేందుకే ఇష్టపడతారు. అయితే, వాటిలో ఎంత వెరైటీ వాచీని తీసుకున్నా.. ఒక్కటే డయల్‌ కాబట్టి ఎప్పుడూ ఒకేలా కనిపిస్తుంది. కొన్నిరోజులకే బోర్‌ కొట్టేస్తుంది.

స్విడ్జర్లాండ్‌కి చెందిన డిజైనర్‌ స్టెఫానొ బ్రగా రూపొందించిన 'హైపర్‌ అయాన్‌' వాచీ మాత్రం అందుకు భిన్నం. ఈ వాచీ డయల్‌లో సగం వరకూ ఓ స్టీలు నిర్మాణం ఉంటుంది. ఆ కింది భాగంలో సూర్య, చంద్రులు ఉన్న స్క్రీన్‌ ఉంటుంది. సమయంతో పాటే తిరిగే ఈ స్క్రీన్‌ కదులుతూ పగటి పూట సూర్యుడినీ.. సాయంత్రానికి అస్తమిస్తున్న సూర్యుడినీ.. ఆ తర్వాత నెలవంకనూ.. చందమామనూ మిగిలిన సగం డయల్‌లో చూపిస్తుంది. ఇంకేముందీ.. ఈ వాచీ డిజైన్‌ ఎప్పటికప్పుడు కొత్తగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

ఇదీ చూడండి:ధాన్యం మిల్లులో సెల్‌ఫోన్‌ రీఛార్జ్‌..!

ABOUT THE AUTHOR

...view details