బంగారు నీలి వర్ణాల కలయికతో మెరిసిపోతున్న కంచిపట్టు బ్రొకెడ్ చీర ఆకట్టుకునేలా ఉంది కదూ.
ఎంచి కడదాం కంచి!
నిర్మలమైన ఆకాశం... పచ్చని ప్రకృతి... మెరిసిపోయే పసిడి... ఇలా అన్ని వర్ణాలూ ఒకేచోట చేరి అతివను చుట్టేస్తే ఎలా ఉంటుంది? కళాంజలి తెచ్చిన కంచిపట్టు వస్త్రశ్రేణిలా ఉంటుందేమో! పండగలు, పర్వదినాలు, వేడుకల్లో మగువలు శ్రీ మహాలక్ష్ముల్లా మెరిసిపోవాలంటే కంచి కట్టాల్సిందే. మరెందుకాలస్యం చూసేయండి మరి.
ఎంచి కడదాం కంచి!
ప్రకాశవంతమైన గులాబీ కంచిపట్టు చీరంతా పరుచుకున్న పసిడి పూలు, పైస్లీ మోటిఫ్‌లు కనువిందు చేస్తున్నాయి. గజరాజుల వరుసతో కూడిన పెద్దదైన అంచు చీరకు ప్రత్యేక ఆకర్షణనూ, కొత్త అందాన్నీ తెచ్చింది.
ఇదీ చూడండి:టాప్-10 పాప్ సింగర్లలో ఒకదాన్నవుతా..