తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

ముఖంపై నల్లమచ్చలు వచ్చాయా.. ఇలా చేయండి - ముఖంపై నల్లమచ్చలు పోగొట్టేందుకు చిట్కాలు

మీ ముఖంపై ముక్కుకి ఇరువైపులా, నోటి చుట్టూ నల్లని మచ్చలు ఏర్పడ్డాయా? ఎన్ని ప్రయత్నాలు చేసినా సత్ఫలితాలు ఇవ్వలేకపోయా? దీనికి ఆరోగ్యపీఠం డాక్టర్​ గాయత్రీదేవి ఏమని సూచించారంటే..

dark spots  solution latest news
ముఖంపైనున్న నల్ల మచ్చలు పోయేదెలా?

By

Published : Oct 8, 2020, 9:17 AM IST

ఇలాంటి మచ్చలు ఎక్కువగా మహిళల్లో, ముఖ్యంగా మధ్య వయస్కుల్లో కనిపిస్తాయి. హార్మోన్ల మార్పులు, గర్భధారణ తర్వాత మెనోపాజ్‌ సమయంలో ఇవి వస్తాయి. వీటిని తగ్గించుకోవడానికి దీర్ఘకాలం శ్రద్ధ పెట్టాలి. నిత్యం 10-12 గ్లాసుల నీటిని తాగడం అలవరుచుకోవాలి. రోజూ గ్లాసు టొమాటో, బీట్‌రూట్‌ లేదా క్యారెట్‌ వంటి కూరగాయల రసం తాగడం తప్పనిసరిగా చేయాలి. ఆహారంలో మసాలా, కారం తగ్గించుకోవాలి. అలాగే ముఖంపై ఎండ పడకుండా జాగ్రత్తపడాలి.

కప్పు పాలలో చెంచా చొప్పున సుగంధపాల, పటికబెల్లం చూర్ణాలను కలిపి రెండుపూటలా నిత్యం తీసుకోవాలి. సుగంధపాలలో చర్మపు రంగుని మెరుగుపరిచే గుణం ఉంటుంది. అలాగే అరచెంచా చొప్పున మంజిష్ట, చందనం చూర్ణాలను తేనెలో కలిపి రెండుపూటలా తీసుకోవాలి. పుల్లటి పెరుగులో మెత్తటి బార్లీపిండి కలిపి పేస్టులా తయారుచేసి మచ్చలపై లేపనంలా వేసుకోవాలి. పావుగంట తరువాత కడిగేయాలి. ఇలా నిత్యం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

రోజూ టొమాటో రసాన్ని మచ్చలపై లేపనంలా రాసి పావుగంట తరువాత నీటితో కడగాలి. అలాగే నిత్యం కొబ్బరినూనెతో మర్దనా చేసి గంట తరువాత సున్నిపిండి, పసుపుతో ముఖాన్ని రుద్ది కడిగేస్తే చాలు. అయితే ఈ సూచనల్ని కొన్నినెలలపాటు ఓర్పుగా పాటిస్తేనే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

ఇదీ చదవండిఃమనస్పర్థలు రాకూడదంటే మిమ్మల్ని మీరు ఇలా పరీక్షించుకోండి!

ABOUT THE AUTHOR

...view details