తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

మీ గోళ్లు మాటిమాటికి విరిగిపోకుండా ఈ చిట్కాలు ప్రయత్నించండి! - health tip for nails beauty

నాకు నెయిల్‌ ఆర్ట్‌ అంటే చాలా ఇష్టం. కానీ నా గోళ్లు కొంచెం పెరిగిన తర్వాత విరిగిపోతున్నాయి. ఇలా కాకుండా ఉండాలంటే నేనేం చేయాలి? అని ఓ సోదరి అడిగిన ప్రశ్నకు ప్రముఖ కాస్మటాలజిస్టు శైలజ సూరపనేని ఈ చిట్కాలు సూచించారు.

health tip for nails by cosmotologist
మీ గోళ్లు మాటిమాటికి విరిగిపోకుండా ఈ చిట్కాలు ప్రయత్నించండి!

By

Published : Jul 10, 2020, 11:56 AM IST

గోళ్లు బలంగా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవాలి. బయోటిన్‌ (విటమిన్‌-బి7) ఆహారంలో పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. ఇది ఆహారం ద్వారా అందకపోతే రోజూ 2.5 మి.గ్రా. మాత్రల రూపంలో తీసుకోవాలి.

ఏ ఆహారంలో

ఉడికించిన గుడ్లు, చిరుధాన్యాలు, గింజలు, సోయాబీన్స్‌, కాలీఫ్లవర్‌, అరటిపండులో బయోటిన్‌ ఉంటుంది. ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, పీచు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

  • పనులు చేసేటప్పుడు గోళ్లు నీటిలో తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దుస్తులు ఉతకడం, గిన్నెలు శుభ్రం చేయడం లాంటి పనులు గ్లౌజ్‌ వేసుకునే చేయాలి. మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు తప్పకుండా తాగాలి. లేకపోతే గోళ్లు పొడిబారిపోతాయి.
  • బ్రాండెడ్‌ నెయిల్‌ పాలిష్‌లనే వాడాలి. ఎసిటోన్‌ లేని నెయిల్‌ రిమూవర్లను వాడాలి. ఇది గోళ్లను పొడిబారుస్తుంది.
  • నెయిల్‌ ఆర్ట్‌లో భాగంగా... కృత్రిమగోళ్లను వాడినప్పుడు సహజమైన గోళ్లు బలహీనమవుతాయి. నెయిల్‌ పాలిష్‌ వాడినా మధ్యలో కాస్త విరామం ఇవ్వాలి. కనీసం రెండు నెలలు వాడకుండా ఉంటే గోళ్లు బలహీనపడకుండా, పసుపు రంగులోకి మారకుండా ఉంటాయి.
  • మాయిశ్చరైజర్‌ను గోళ్లకు కూడా రాయాలి. శానిటైజర్‌ వాడకం వల్ల కూడా గోళ్లు పొడిబారతాయి. అలాగే ఇంట్లో ఉన్నప్పుడు అతిగా శానిటైజర్‌ వాడటం వల్ల చర్మం, గోళ్లు పొడిబారతాయి.

ఇదీ చదవండిఃగోళ్లు పెంచుకుంటున్నారా...? వెంటనే కత్తిరించండి...

ABOUT THE AUTHOR

...view details