ఎండబెట్టిన తులసి ఆకుల్ని పొడిగా చేసుకుని దానిలో ఒక టేబుల్ స్పూన్ పాలు, నాలుగు చుక్కల బాదం నూనె కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తరవాత కడుక్కోవాలి. తరచూ ఇలా చేస్తుంటే మొటిమలు, వాటి తాలూకుమచ్చలు మాయం అవుతాయి. అదే తెల్ల మచ్చలు వేధిస్తుంటే పచ్చిపసుపు కొమ్ముని అరగదీసి గంధంలో కలుపుకొని రాసుకోవాలి.
అమ్మమ్మ చిట్కాలతో మెరిసిపోదాం..! - Benefits of Basil Leaves
ముఖం మెరిసిపోవాలనీ, జుట్టు నిగనిగలాడిపోవాలనీ మనం చేయని ప్రయత్నం ఉండదు. ఇందుకు అమ్మమ్మల కాలం నాటి కొన్ని చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి. అవేంటో చూద్దామా...

అమ్మమ్మ చిట్కాలతో మెరిసిపోదాం..!
జుట్టు నిర్జీవంగా కనిపిస్తుంటే నాలుగు చెంచాల బియ్యాన్ని బాగా కడిగి నానబెట్టండి. ఆపై నీళ్లుపోసి ఉడికించండి. ఆ గంజిలో కాస్త మజ్జిగ, ఒక గుడ్డు కలిపి తలకు పట్టించి ఆరనివ్వండి. అరగంటయ్యాక గాఢత తక్కువ ఉండే షాంపూతో తలస్నానం చేయండి. ఎంత చక్కటి ఫలితం ఉంటుందో మీరే గమనించొచ్ఛు.
ఇదీ చదవండి:'కోజికోడ్ విమానాశ్రయ రన్వే సురక్షితమైనదే'