తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

సన్నజాజి తీగలా నాజుగ్గా మారాలనుకుంటున్నారా? - వ్యాాయామంతో బక్కగా అయ్యేందుకు చిట్కాలు

బరువు తగ్గాలని అనుకుంటున్నారా? అందంగా కనిపించాలనుకుంటున్నారా? అయితే ఈ వ్యాయామ చిట్కాలు మీకోసమే...

health tips and exercise tips to become thin
సన్నజాజి తీగలా నాజుగ్గా మారాలనుకుంటున్నారా?

By

Published : Sep 18, 2020, 2:44 PM IST

అదనపు బరువు తగ్గడం వల్ల శరీరం చురుగ్గా మారుతుంది. ఒకేసారి బరువు తగ్గాలని ఆలోచించొద్దు. క్రమంగా, పద్ధతి ప్రకారం తగ్గాలి. అందుకోసం జాగింగ్‌, రన్నింగ్‌, స్విమ్మింగ్‌ లాంటి హై ఇంటెన్సిటీ ఎక్సర్‌సైజులను ఎంచుకున్నా ఫలితం ఉంటుంది. స్క్వాట్స్‌, పుషప్స్‌, జంపింగ్‌ జాక్స్‌, లాంజెస్‌, ప్లాంక్‌, సైడ్‌ లిఫ్ట్స్‌ వంటివన్నీ మీ వ్యాయామ ప్రణాళికలో చేర్చుకోవచ్చు.

అయితే మీరు చేసే సర్క్యూట్‌లో రెండు, మూడు వ్యాయామాలు ఉండేలా చూసుకోవాలి. ఇలా చేస్తే కాళ్లు, చేతులు, ఛాతీ, భుజాలు, పొట్ట.. ఇలా శరీరంలోని అన్ని భాగాలకూ వ్యాయామం అందుతుంది. కండరాలన్నీ బలంగా మారి కొవ్వూ తగ్గుతుంది. అలానే వ్యాయామం అంటే సిటప్స్‌, పుషప్స్‌, బరువులు ఎత్తడమే కాదు...డాన్స్‌, స్కేటింగ్‌, ఈత... ఇవన్నీ కూడా వ్యాయామాల కిందకే వస్తాయి.

ఇదీ చదవండిఃకరోనా కారణంగా పరిమితంగానే బస్సు సర్వీసులు

ABOUT THE AUTHOR

...view details