నిద్రపోయే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకుని కలబంద గుజ్జును రాసి కాసేపు మృదువుగా మర్దనా చేసుకోవాలి. క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే మోము తాజాగా ఉంటుంది.
కీరాతో..
రెండు చెంచాల గుజ్జులో కొన్ని చుక్కల కీరా రసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.
పెరుగుతో..
పావు కప్పు అలొవెరా పేస్ట్‌లో రెండు చెంచాల పెరుగు వేసి బాగా కలపాలి. దీన్ని చర్మానికి పట్టించి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే మార్పు మీకే తెలుస్తుంది.
ఆలివ్ ఆయిల్‌తో..
ఈ నూనెతో బోలెడు లాభాలుంటాయి. ఇది జుట్టుకు, చర్మానికి రెండు విధాలుగా మేలు చేస్తుంది. కాస్తంత అలొవెరా గుజ్జులో కొన్ని చుక్కల ఆలివ్ నూనె కలిపి ముఖానికి పట్టించాలి. ఈ పూతను నిద్రపోయే ముందు వేసుకుంటే చర్మానికి చక్కటి నిగారింపు వస్తుంది.
ఇదీ చూడండి: ప్రేమ అని భ్రమించా.. జీవితాన్ని కూలదోశా!