- నిలబడి కాళ్లను కాస్త దూరంగా జరిపి ఎడమచేతిని నడుము మీద ఆనించాలి. ఇప్పుడు కుడి మెకాలిని పైకి లేపి కుడి మోచేతిని దానికి తగిలించాలి. తర్వాత ఎడమ మోకాలితోనూ ఇలాగే చేయాలి. ఇలా సెట్టుకి ఇరవై చొప్పున రెండు సార్లు చేయాలి.
- కింద కూర్చుని రెండు మోకాళ్లనూ కాస్త పైకి లేపాలి రెండు చేతులను ఏదో పట్టుకున్నట్టుగా కాస్త దగ్గరగా పెట్టాలి. ఇప్పుడు చేతులను ఒకసారి కుడివైపు, మరోసారి ఎడమవైపు తిప్పాలి. ఇలా ముప్పైసార్లు చేయాలి.
- నేల మీద కూర్చుని రెండు కాళ్లను కాస్త పైకి పెట్టాలి. రెండు చేతులను చెవులు ఆనించి మోచేతులు మడవాలి. తర్వాత ఒక కాలిని నిటారుగా ఉంచి మరో కాలిని మడవాలి. మడిచిన కుడికాలును కుడిమోచేత్తో తాకాలి. అలాగే ఎడమకాలిని మడిచినప్పుడు ఎడమ మోచేత్తో తాకాలి. ఇలా రెండు కాళ్ల తోనూ చెట్టు ఇరవై చొప్పున రెండు సార్లు చేయాలి.
చూడచక్కని నాజూకైన నడుము మీ సొంతం కావాలంటే..
నడుము చుట్టూ లావుగా ఉంటే.. మనిషంతా లావుగా ఉన్నట్టే కనిపిస్తారు. 'నడుమెక్కడే నీకు.. నవలామణి..' అని చూసినవాళ్లు మెచ్చుకున్నా.. మెచ్చుకోకపోయినా చక్కని నడుము మీ సొంతం కావాలంటే.. ఈ వ్యాయామాలు ప్రయత్నించండి!
exercises for slim waist for women