లేతాకుపచ్చ కుప్పాడమ్ సిల్క్-కాటన్ చీరపై బంగారు గళ్లు, నెమళ్లు, సిల్వర్ పోల్కా డాట్స్.. జతగా ఎర్రటి అంచు, కొంగు అదరహో అనిపిస్తున్నాయి.
కుప్పాడమ్ కాంతులతో శ్రావణ కళ తెచ్చేయండిలా.. - saree trends during sarvana masam
మాములు రోజుల్లో ఎలా ఉన్నా.. పండుగ రోజుల్లో అమ్మాయిలను ఆకట్టుకునేవి మాత్రం చీరలే. అందులోనూ శ్రావణ మాసంలో వివిధ రకాల చీరలు కట్టుకుని పండక్కి కొత్త కళ తీసుకొస్తారు. ఇలాంటి సందర్భాలకు సరిపోయే లేతాకు పచ్చచీరలో ప్రకృతి కాంతలా... నీలివర్ణంలో శ్రీమహాలక్ష్మిలా... బంగారు గళ్లు, రుద్రాక్ష మోటిఫ్‌లతో ఆదిలక్ష్మిలా మెరిసిపోండిలా..!
![కుప్పాడమ్ కాంతులతో శ్రావణ కళ తెచ్చేయండిలా.. fasion of sarees during sravana masam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8324607-408-8324607-1596770070754.jpg)
కుప్పాడమ్ కాంతులతో శ్రావణ కళ
ముదురు ఊదారంగు కుప్పాడమ్ సిల్క్-కాటన్ చీరపై బంగారు గళ్లు వాటిలో రుద్రాక్ష మోటిఫ్‌లు బాగున్నాయి కదూ...!