అందంగా కనిపించడం అంటే ప్రతి ఫ్యాషన్‌నీ అనుకరించడం కాదు.. ఎవరికో నప్పింది మనకి నప్పకపోవచ్ఛు వేసుకునే దుస్తులు సౌకర్యంగా, చూసేవారికి ఎబ్బెట్టుగా అనిపించకుండా చూసుకోవడమే ప్రాథమిక నియమం.
ట్రెండీగా కనిపించాలని అనుకుంటున్నారా.. ఈ చిట్కాలు ఫాలో అవ్వండి!
ట్రెండీగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. కానీ అందుకోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియక పొరబాటు పడుతుంటారు. అలాంటివారికోసమే ఈ చిట్కాలు..
ట్రెండీగా కనిపించేందుకు చిట్కాలు
కొందరు తమకంటూ ప్రత్యేక స్టైల్ స్టేట్‌మెంట్ క్రియేట్ చేసుకుంటారు. కేశాలంకరణో, పెట్టుకునే బొట్టో.. ఎంచుకునే డ్రెస్సో.. అది తమకే ప్రత్యేకం అన్నట్లు మార్చేసుకుంటారు. మీరూ అలాంటి ట్రెండ్ ఒకదాన్ని సెట్ చేసుకోండి.
మీకంటూ ఓ ప్రత్యేకత ఉండాలి కదా! అలాగని ఎప్పుడూ ఒకే మూసలో ఉండిపోకూడదు. మార్పులూ ప్రయత్నించాలి. ఉదాహరణకు స్ట్రెయిట్ కట్ కుర్తీల మీదకు లెగ్గింగ్‌లే కాదు.. పలాజోలూ, యాంకిల్ లెంగ్త్ ప్యాంట్లూ ఎంచుకోవచ్ఛు.