జిడ్డుపోవాలంటే:బాగా పండిన మూడు స్ట్రాబెర్రీలను గిన్నెలోకి తీసుకుని టేబుల్‌స్పూన్ పెరుగు వేసి బ్లెండర్‌తో బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు పట్టించి ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
స్క్రబర్:అరకప్పు పెరుగులో రెండు టీస్పూన్ల సెనగపిండి, టొమాటో రసం వేసి బాగా కలపాలి. దీన్ని ముఖానికి పట్టించిన ఐదు నిమిషాలు తర్వాత సవ్య, అపసవ్య దిశల్లో మర్దన చేయాలి. ఆ తర్వాత చన్నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.
మచ్చలు పోవడానికి:కొంచెం పెరుగులో టీస్పూన్ పసుపు వేసి కలపాలి. దీన్ని ముఖానికి మెడకు పట్టించి అరగంట తర్వాత కడుక్కోవాలి.