తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

టీ బ్యాగ్​ను పారేయకండి.. ఇంటిని శుభ్రం చేసేయండి! - వాడేసిన టీ బ్యాగులతో ఇంట్లో వాసనలు రాకుండా సూచనలు

టీ తాగడంతోనే మన దినచర్య మొదలవుతుంది. మనలో చాలామంది ఇందుకోసం టీ-బ్యాగులను ఉపయోగిస్తారు వీటి వినియోగం తరువాత పారేయకుండా పలు విధాలుగా ఉపయోగించవచ్చు. ఎలానో తెలుసుకుందాం...

Do not throw away the teabag .. Use it in many ways!
టీబ్యాగ్​ను పారేయకండి.. వీటితో ఇంటిని శుభ్రం చేసేయండి!

By

Published : Oct 8, 2020, 7:41 AM IST

  • కిటికీ అద్దాలు తళతళలాడేలా..

కిటికీ అద్దాలు, డ్రెస్సింగ్ టేబుల అద్దం... వీటిని వాడేసిన టీ బ్యాగులను ఉపయోగించి శుభ్రం చేయొచ్చు. దీంతో అద్దాల మీద రుద్దండి. కాసేపటి తరువాత పేపర్​తో తుడిస్తే మరకలు పోయి కొత్తవాటిలా తళతళలాడతాయి.

  • కలప సామగ్రి మెరిసేలా.

కాసిన్ని నీళ్లలో వాడేసిన టీ బ్యాగులను వేసి రెండు నిమిషాలపాటు మరిగించాలి. ఈ నీటిని చల్లార్చాలి. ఇప్పుడు శుభ్రమైన మెత్తటి వస్త్రాన్ని ఈ నీటిలో ముంచి ఫర్నిచర్​ను తుడవాలి. ఆ తరువాత పొడి వస్త్రంతో తుడిస్తే ఫర్నిచర్ కొత్త దానిలో మెరుస్తుంది.

  • పాత్రలు శుభ్రం

టీ బ్యాగులు వేసి వేడిచేసిన నీటిలో ఈ మొండి మరకలున్న పాత్రలను రాత్రంతా నాన బెట్టాలి. మరుసటి రోజు డిష్ వాషర్​తో తోమితే మరకలు క్షణాల్లో మాయమవుతాయి.

  • దుర్వాసనలు దూరం

ప్రిజ్ నుంచి అప్పుడప్పుడు దుర్వాసన వెలువడుతుంటుంది. అలాంటప్పుడు ప్రతి ఆరలో వాడేసిన టీ బ్యాగు పెడితే సరి. ఇవి దుర్వాసనను పీల్చుకుంటాయి. డస్ట్​బిన్​లోనూ వీటిని పెట్టవచ్చు

  • ఎయిర్ ఫ్రెష్​నర్​గా

మీ ఇంట్లో పరిమళాలు వెదజల్లే ఎయిర్ ఫ్రెష్​నర్​గానూ దీన్ని వాడొచ్చు. ఇందుకోసం వీటిని పూర్తిగా ఎండబెట్టాలి. ఆ తర్వాత ఈ బ్యాగుల్లో కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ వేసి మీకు నచ్చిన చోట్ల వీటిని పెడితే సరి. చక్కటి సువాసనలను వెదజల్లుతూ ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.

ఇదీ చదవండిఃరోజూ 'గ్రీన్​ టీ' తాగితే బరువు తగ్గుతారా?

ABOUT THE AUTHOR

...view details