సౌకర్యంగా...
వేసవి దుస్తులను ఎంచుకునేటప్పుడు అవి మనకు సౌకర్యంగా ఉన్నాయా లేదా అని కొనే ముందు గమనించుకోవాలి. శరీరాకృతికి తగ్గట్లుగా నడుము, భుజాల వద్ద సరైన కొలతలుంటే చాలు. మిగతా డ్రెస్ అంతా వదులుగా ఉన్నా చూడటానికి ఆకర్షణీయంగానే ఉంటుంది. పలాజో-వదులైన టాప్, పైజామా-వదులు జుబ్బా, తేలికైన కాటన్ టాప్, మోకాళ్ల కింద వరకు స్కర్టు బాగుంటాయి. ఏ దుస్తులు ధరించినా మనకు సౌకర్యంగా ఉంటే అవి మనకు నప్పినట్లే.
కొత్తగా...
పొడవు గౌను ఫ్యాషన్ ఈ సీజన్‌లోనూ కొత్తగానే అనిపిస్తుంది. దీనికి మృదువైన వస్త్రాన్నే ఎంచుకోవాలి. చేతులు, నడుము కింద కొంత వదులుగా ఉన్నా చూడటానికి బాగుంటుంది. మోకాళ్ల వరకు వచ్చే కాటన్ గౌన్లు కూడా ఈ వేసవిలో బాగా నప్పుతాయి.