రోజూ పావుకప్పు టొమాటో గుజ్జులో చెంచా తేనె కలిపి ముఖానికి సవ్య, అపసవ్య దిశల్లో మృదువుగా మర్దన చేయాలి. ఇలాచేస్తే చర్మంపై పేరుకున్న మురికి, టాన్ తొలగి కాంతిమంతంగా కనిపిస్తుంది.
వయసు పెరిగే కొద్దీ చర్మం సాగినట్లు కనిపిస్తుంది. దీనికి పరిష్కారంగా పావుకప్పు టొమాటో గుజ్జులో ఒక గుడ్డులోని తెల్లసొన, చెంచా నిమ్మరసం కలిపి... ఈ మిశ్రమాన్ని కనీసం వారానికి రెండు సార్లు ప్యాక్‌లా వేసుకుంటే ఫలితం ఉంటుంది.