తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

గులాబీలా మోము మెరుస్తుందిలా! - vasundara news

ఒక్కోసారి ఉన్నట్టుండి ముఖం పొడిబారిపోతుంది. నిర్జీవంగానూ కనిపిస్తుంది.... ఇలాంటప్పుడు ఈ గులాబీ పూతలు ప్రయత్నించి చూడండి. వీటితో ఉపశమనం పొంది మీ చర్మం కళగా కనిపిస్తుంది.

beauty tips for glorious face
గులాబీలా మోము మెరుస్తుందిలా!

By

Published : Apr 8, 2021, 1:14 PM IST

చెంచా చొప్పున యాపిల్‌ తురుము, గులాబీనీళ్లూ, అరటి పండు గుజ్జు తీసుకోవాలి. దీనికి అరచెంచా ఓట్స్‌ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసుకుని పావుగంటయ్యాక చల్లటి నీళ్లతో కడిగేస్తే సరి. ఇది చర్మంపై టాన్‌ని తొలగిస్తుంది. యాపిల్‌, గులాబీ నీటిలోని విటమిన్‌-సి యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడుతుంది. నిగారింపునీ ఇస్తుంది. అరటిపండులోని పోషకాలు తేమని అందించి కాంతివంతంగా కనిపించేలా చేస్తాయి.

అరకప్పు గులాబీరేకల ముద్దకు, చెంచా చొప్పున నారింజ తొక్కల పొడి, చెంచా పెరుగు, తేనె చేర్చి బాగా కలపాలి. దీన్ని ముఖం, మెడ, చేతులకు ప్యాక్‌లా వేసుకోవాలి. ఆరాక గోరువెచ్చని నీళ్లతో మృదువుగా మర్దనా చేసుకుంటూ కడిగేస్తే సరి. చక్కటి నిగారింపు వస్తుంది. గులాబీల్లో సహజంగానే నూనెలుంటాయి. ఇవి తేమను అందించి మెరిపిస్తాయి. నారింజ తొక్కల పొడిలోని విటమిన్‌సి, ఏ లు మేనిని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ పూతలను రాత్రి నిద్రపోయే ముందు ప్రయత్నిస్తే... మరుసటి రోజు ఉదయం మీ మోము మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది.

వేసవిలో నూలు, చేనేత రకాల్ని ఎంచుకుంటే... చెమట పీల్చుకుని చల్లదనాన్ని ఇస్తాయి. వాటిల్లో లేత రంగులకు ప్రాధాన్యం ఇవ్వండి. ఇవి వేడిని అడ్డుకోగలుగుతాయి.

ఇదీ చదవండి: డిప్రెషన్‌తో బాధపడుతున్నారా?

ABOUT THE AUTHOR

...view details