మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ రోడ్డు ప్రమాదం రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. శుక్రవారం రోజు ఆయన రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. సాయిధరమ్‌తేజ్.. ఓ స్పోర్ట్స్ బైక్‌పై తీగల వంతెనపై నుంచి వస్తుండగా ప్రమాదం సంభవించింది. మెగా అభిమానులంతా.. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. మరోవైపు చాలా మంది తేజ్ వాడిన ట్రయంఫ్ స్పోర్ట్స్ వాహనం గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఆ బండి వివరాలివే...
సాయిధరమ్ తేజ్ వాడిన హై ఎండ్ స్పోర్ట్స్ బైక్ పేరు ట్రయంఫ్. మోడల్ పేరు స్ట్రీట్ ట్రిపుల్ ఆర్‌ఎస్. ఆరుగేర్లు ఉండే ఈ వాహనం స్టార్ట్ చేసిన నాలుగు సెకన్లలో వంద కిలో మీటర్ల వేగానికి అందుకుంటుంది. ప్రత్యేకంగా రేసింగ్‌ల కోసమే దీన్ని డిజైన్ చేశారు. 45 డిగ్రీల కోణంలో బండిని ఒంపినా కూడా నియంత్రించుకునే సౌకర్యం ఉండటం ఈ బండి ప్రత్యేకత.
- ఈ మోడల్ ధర అన్నీ కలిపి: రూ.12.80 లక్షలు
- కూర్చునే సీటు ఎత్తు: 825 ఎంఎం
- గంటకు అత్యధికంగా ప్రయాణించగల వేగం: 240 కిలోమీటర్లు
- పెట్రోలు లీటరుకు మైలేజీ: 20 కి.మీ
- సామర్థ్యం: 765 సీసీ
- బరువు: 166 కిలోలు
- ఇంధన సామర్థ్యం: 17.4 లీటర్లు