- స్టన్‌గన్‌తో షాకిద్దాం... ఎర్రటి పెదాలకోసం ఉపయోగించే దీన్ని....దుండగులను ఎదుర్కోవడానికి కూడా ఉపయోగించొచ్చు. రీఛార్జ్ చేసుకోవడానికి వీలుండి ముప్పైలక్షల వోల్టేజ్‌తో షాకిస్తుంది. ఒకవైపు లిప్‌స్టిక్ మరోవైపు ఈ సౌలభ్యం ఇందులో ఉంటుంది.
- దువ్వెనతో దూకుడుగా... ఆఫీసుకెళ్తున్నా, ప్రయాణాలు చేస్తున్నా హ్యాండ్‌బ్యాగ్‌లో వెంట ఓ దువ్వెన ఉంచుకుంటాం. అయితే అందులోనే ఓ చాకూ ఉంటే...! ప్రమాదం ఎదురైనప్పుడు రక్షణగా వాడొచ్చు. ఇవి ఆన్‌లైన్‌లో సులువుగానే దొరుకుతున్నాయి.
- హ్యాండ్‌బాగే ఆసరాగా... హ్యాండ్‌బ్యాగ్ ఫ్యాషన్‌గా ఉందా లేదా అన్నదే కాదు...అవసరమైతే మీకు అదే ఆయుధం కావాలని గుర్తుంచుకోండి. వీలైతే మీ బ్యాగ్‌లో చిన్న మెటాలిక్ పాయింటెడ్ లేదా హ్యాండిల్ ఉన్న క్లచ్‌ని ఉంచుకోండి.
- పిన్నులతో పొడిస్తే... జుట్టుకి ఆకర్షణ తెచ్చే చెంప పిన్నులు లోహంతో చేసినవై ఉంటాయి. ఇబ్బంది ఎదురైనప్పుడు, ఎవరైనా అసౌకర్యాన్ని కలిగిస్తున్నప్పుడు పిన్నుతో దాడి చేయండి.
- చెప్పులతో సౌకర్యంగా... ఎత్తు చెప్పులు ఎక్కువ సమయం మంచిది కాదని చెబుతారు. ఒంటరిగా ప్రయాణించాల్సి వచ్చినప్పుడు మాత్రం ఇవే మీకు రక్షణ. ముఖ్యంగా పాయింటెడ్ హీల్స్‌ను ధరించడం వల్ల ఆగంతుకులు దాడి చేసినప్పుడు మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి అవకాశం దొరుకుతుంది. మరీ ఎత్తు చెప్పుల్ని వేసుకుని నడవలేనప్పుడు కిటెన్‌హీల్స్‌ని ఎంచుకోవచ్చు.
అందానికి దాచుకుని... ఆత్మరక్షణకు వాడండి - వసుంధర వార్తలు
చదువు, ఉద్యోగం, ఉపాధి... కారణం ఏదైనా అమ్మాయిలు గడపదాటి బయటికెళ్లాల్సి వస్తోంది. వెళ్లిన చోట వేధింపులు ఎదురుకావొచ్చు. దుండగులు దాడి చేయొచ్చు. ఇలాంటి ఆపత్కాలంలో ఆత్మస్థైర్యంతో పాటు ఆత్మరక్షణా అవసరమే. హ్యాండ్‌బ్యాగులో సులువుగా తీసుకెళ్లగలిగే వస్తువులు మీకెంతో ఉపయోగపడతాయి. అవేంటో.. ఎలా వినియోగించాలో చూడండి.

things in handbag can be used for self defence