- ఓ మంచి ప్రారంభం
ఎలిమెంట్స్ ఆఫ్ ఫొటోగ్రఫీ
దేన్నయినా నేర్చుకుందాం అనుకుంటే బేసిక్స్ నుంచి ప్రారంభించడమే సరైన విధానం. ఫొటోగ్రఫీలో కూడా ఇలాగే ప్రాథమిక చిట్కాలతో మొదలుపెట్టేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఫోన్‌ని ముందు పెట్టుకుని విభాగాల వారీగా రియల్-టైమ్‌లోనే నేర్చుకోవచ్చు. అంటే.. మీకు డీఎస్‌ఎల్ కెమెరా ఉంటే ఫోన్‌లో ఛాప్టర్‌లను చూస్తూ సాధన చేయొచ్చు. పాఠం పూర్తయ్యాక చివర్లో క్విజ్ ఉంటుంది. మీరెంత సాధన చేశారో తెలుసుకునేందుకు ఓ పరీక్ష లాంటిది అన్నమాట. ఉచిత వెర్షన్‌లో కొన్ని బేసిక్స్‌ని నేర్చుకోవచ్చు. కావాలంటే ప్రీమియం వెర్షన్‌కి అప్‌డేట్ అవ్వొచ్చు.
డౌన్‌లోడ్ లింక్: http:bit.ly/3d5xKJG
- పాఠ్యాంశాల వారీగా..
ఫొటోగ్రఫీ ట్యుటోరియల్స్
ఏదైనా కొత్త అంశాన్ని నేర్చుకుందాం అనుకుంటే ఆన్‌లైన్ పాఠాలు ఏమున్నాయా? అని వెతికేస్తాం. ఫొటోగ్రఫీపై అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ ట్యుటోరియల్స్‌ని గుత్తగా ఒకేచోట అందిస్తోంది ఈ యాప్. అంశాల వారీగా కావాల్సిన వాటిని సెలెక్ట్ చేసి చదువుకోవచ్చు. సుమారు 2,000లకు పైనే ఫొటోగ్రఫీ ట్యుటోరియల్స్ ఉన్నాయి. ఒక్కొక్క టాపిక్‌ని ఎంపిక చేసుకుని చదువుకుంటూ మీ స్కిల్స్‌ని సాన పెట్టొచ్చు.
డౌన్‌లోడ్ లింక్:http:bit.ly/3pbga9u
- కోర్సుల అడ్డా..