తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

నేను నిత్యం క్వారంటైన్లోనే.. నేనెవరో తెలుసా! - Sand Viper snake news

హాయ్‌ ఫ్రెండ్స్‌... ఇప్పుడు ఎక్కడ చూసినా క్వారంటైన్‌.. అనే పదమే వినిపిస్తోంది కదూ! మీకు ఇది కొత్త కావొచ్ఛు. కానీ నాకు ఇది నిత్యకృత్యం. నేను పుట్టినప్పటి నుంచే క్వారంటైన్‌ పాటిస్తున్నా! విచిత్రంగా ఉంది కదూ.. అయితే ఆలస్యం ఎందుకు? చదివేయండి మరి.

special story on Sand Viper snake
నేను నిత్యం క్వారంటైన్లోనే.. నేనెవరో తెలుసా!

By

Published : Jul 29, 2020, 2:01 PM IST

అవును.. నేను ఇంతకీ ఎవరో చెప్పానా మీకు? అయ్యో.. మరిచిపోయాను సారీ. అది సరే కానీ.. నేను మరిచిపోతే మీరైనా గుర్తు చేయాలి కదా ఫ్రెండ్స్‌!! పోనీలే నేను ఇప్పుడు చెబుతాలే!

  • నా పేరు శాండ్‌ వైపర్‌.
  • నేనో విషపూరిత ఎడారి పామును.
  • ఎక్కువగా ఉత్తర ఆఫ్రికా, సహారా ఎడారి ప్రాంతంలో ఉంటాను.
  • కేవలం 20 నుంచి 35 సెంటీమీటర్ల పొడవుంటా అంతే.
  • చిన్న చిన్న ఎడారి బల్లులను తిని బతికేస్తుంటా.
  • నేను ఒంటరిగానే సంచరిస్తుంటా. అందులోనూ ఎక్కువ సమయం ఇసుక కిందే గప్‌చుప్‌గా గడిపేస్తా.
  • మిగతా పాముల్లా నేరుగా పాకలేను. ఇసుక తిన్నెలపై అడ్డంగా పాకేస్తుంటా.
  • అచ్చంగా ఇసుక రంగులోనే ఉంటాను. పరిశీలనగా చూస్తేగానీ కనిపించను.
  • ఇసుకలో కూరుకుపోయి.. కేవలం తల, తోక మాత్రమే బయట పెడతాను.
  • తోకను అటూ ఇటూ కదిలిస్తూ ఎడారి బల్లుల్ని ఆకర్షిస్తాను.
  • పాపం అవి నా తోకను చూసి ఏవో పురుగులనుకొని భ్రమపడి దగ్గరకు రాగానే వాటిని తినేస్తా.
  • ఫ్రెండ్స్‌ ఇలా సాధ్యమైనంత ఎక్కువగా నేను క్వారంటైన్‌లోనే గడిపేస్తా.

ABOUT THE AUTHOR

...view details