తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

ఈసారి ఎద్దును ఆపుతారా? కొమ్మును వంచుతారా? - చిత్తూరు జిల్లాలో పశువుల పండగ న్యూస్

సంక్రాంతి పండగ అనగానే కోస్తా ఆంధ్రాలో కోళ్ల పందాలు, రాయలసీమలో పశువుల పండుగకు పెట్టింది పేరు. అందులోనూ చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని ఏ.రంగంపేటది ప్రత్యేకం. గ్రామస్థుల ఆచారం... పోలీసుల ఆంక్షల మధ్య అక్కడ పశువుల పండగ జరుగుతుందా? లేదా? అనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.

pasuvula-panduga-in-chittoor
ఈసారి ఎద్దును ఆపుతారా? కొమ్మును వంచుతారా?

By

Published : Jan 14, 2021, 10:44 AM IST

సంక్రాంతి పండగ అనగానే అందరి చూపు ఏపీలోని చిత్తూరు జిల్లా వైపు ఉంటుంది. అందుకు కారణం ఇక్కడ జరిగే పశువుల పండగ. సంక్రాంతి చివరిరోజు వేల సంఖ్యలో ఏ.రంగపేటకు ప్రజలు చేరుకుంటారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా.. గ్రామస్థులు పండగను నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ పండగను చూసేందుకు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులూ ఈ గ్రామానికి వస్తారు.

ప్రతి ఏటా జనవరి 15 నుంచి నెల చివరి వరకూ పశువుల పండుగ నిర్వహించడం చిత్తూరు జిల్లాలో తరతరాలుగా వస్తున్న ఆచారం. సంక్రాంతి పండగలో చివరి రోజు కనుమ పండగ. సంవత్సరం అంతా రైతులకు సహాయంగా ఉండే మూగజీవాలను ఆ కనుమ రోజున ఆరాధించడం ఇక్కడి ప్రజల సాంప్రదాయం. పండుగ ముందు రోజు నుంచే పశువులను సిద్ధం చేస్తారు. వాటికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఎద్దులను ఒక్కొక్కటిగా ఊరు మధ్యలో జనాలపైకి వదులుతారు. వాటిని నిలువరించి కొమ్ములకు కట్టిన చెక్క పలకలను దక్కించుకునేందుకు యువకులు పోటీ పడతారు. ఇది చిత్తూరు జిల్లాలోని పశువుల పండగ తీరు.

ఏ.రంగంపేటలో అత్యధికంగా పాడి పంటపైనే ఆధారపడి జీవనం సాగిస్తారు. రైతు అభివృద్ధికి, ఆదాయానికి ముఖ్య కారణమైన గోమాతను పూజించడం తరతరాలుగా వస్తున్న ఆచారమని గ్రామస్థులు చెబుతారు. పశువుల పండగకు ఆంక్షలు విధించడం విడ్డూరంగా ఉందంటున్నారు. పశువుల పండుగను తిలకించడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ తమకు బంధువుతోనే సమానమని భావించిన గ్రామ పెద్దలు, యువకులు వారికి భోజనం, తాగునీటి సౌకర్యం కల్పిస్తారు. జల్లికట్టుకు పశువుల పండుగకు చాలా తేడా ఉందని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details