తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

ఇంటి నుంచి పని చేసే వారి కోసం ఈ చిట్కాలు...

కరోనా వల్ల చాలా వరకు ఉద్యోగులు వర్క్​ ఫ్రమ్ హోం చేస్తున్నారు. ఇంటి నుంచి ఎంత అంకితభావంతో పని చేస్తున్నా.. మీ పనిని చూడాల్సిన పైవాళ్లు సకాలంలో స్పందించడం లేదని మీరు ఒత్తిడికి గురవుతున్నారా? మీ కోసమే ప్రముఖ ఆర్గనైజేషనల్ సైకాలజిస్ట్ కవిత గూడాపాటి కొన్ని చిట్కాలు చెబుతున్నారు.

Organizational Psychologist kavitha tips for work from home
ఇంటి నుంచి పని చేసే వారి కోసం ఈ చిట్కాలు...

By

Published : Sep 8, 2020, 12:24 PM IST

ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కంపెనీలు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. అలాంటిది మీరు కొత్తగా ఉద్యోగంలో చేరి కొనసాగడం చాలా సంతోషించాల్సిన విషయం. ఆఫీసు వాతావరణంలో పనిచేయడానికీ, ఇలాంటి మహమ్మారి సమయంలో ఇంటినుంచి పనిచేయడానికీ చాలా తేడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పనిచేయడం ఒత్తిడితో కూడుకున్న అంశమే కాదు, చాలా క్లిష్టమైన విషయం కూడా. ఉద్యోగ జీవితాన్ని ఈ పరిస్థితుల్లో ప్రారంభించడం కచ్చితంగా ఇబ్బందికరమే అయినా కూడా మీరు పనిమీద దృష్టిపెట్టి సకాలంలో టాస్క్‌లు పూర్తిచేయండి.

అదే సమయంలో పైవాళ్లతో సంప్రదించేటపుడు ఓపిగ్గా, మర్యాదపూర్వకంగా మెలగండి. వాళ్లకి మీ పనికంటే కూడా ముఖ్యమైన, అత్యవసరమైన అంశాలు ఉండొచ్చు. కాబట్టి మీ ఫోన్‌, మెయిల్స్‌కి వెంటనే స్పందిస్తారనుకోవద్దు. నొప్పించకుండానే వాళ్లతో మీ పని గురించి గుర్తుచేస్తుండాలి. ఈ విషయాన్ని మీ మేనేజర్‌ దృష్టికి తీసుకువెళ్లి మంచి పనిచేశారు.

ఎందుకంటే కంపెనీలో ఇది మీ ఒక్కరి సమస్యే కాకపోవచ్చు. రెండు వారాలకోసారైనా మేనేజర్‌కి మీ పని వివరాలు పంపుతుండండి. అదే సమయంలో పైవాళ్ల ఆలస్యం కారణంగా మీకు దొరికే ఖాళీసమయంలో నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోండి. నెట్‌వర్కింగ్‌ పెంచుకోండి. మీ వృత్తికి సంబంధించి ఏవైనా వెబినార్‌లు ఉంటే హాజరవ్వండి. యువతలో చాలామంది కరోనా కారణంగా దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. మీరూ ఆ దిశగా ప్రయత్నం చేయండి.

ABOUT THE AUTHOR

...view details