విఘ్నేశుడి ప్రతిమను పెట్టే మండపం కాస్త ఎత్తుగా ఉండేలా చూసుకోండి. దీనికి పీటలే కాదు. కార్టన్ బాక్సులు, కాస్త పెద్ద ప్లాస్టిక్ డబ్బాలు, బల్లలు వంటివి ఉపయోగించొచ్చు. అయితే వాటి అసలు రూపుని కనిపించనీయకుండా కలర్‌పేపర్, గ్లిట్టర్, వెల్వెట్ క్లాత్‌లతో కొత్త లుక్ తీసుకురావొచ్చు.
- మండపం అలంకరణకు పూలతో పాటు ఆకులని ఉపయోగించినా అందంగా ఉంటాయి. ఆర్నమెంటల్ ప్లాంట్‌లను మండపం చుట్టూ పెట్టి మధ్యలో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠిస్తే సరి. ఆపై వెనక భాగంలో కొన్ని సీరియల్ లైట్లు పెట్టండి. కళగా ఉంటుంది. ఇవే కాదు అరటి, కొబ్బరి ఆకులనూ అందంగా అమర్చొచ్చు.
- థర్మకోల్ క్యూబ్స్‌ని ఆధారంగా చేసి ఓ చిన్న మండపాన్నీ నిర్మించేయొచ్చు. వీటికి పూలు, ఆకులతో తీగల్ని అల్లిస్తే... భలే ఉంటుంది. పాలవెల్లిల్లా పూలు, పండ్లను వేలాడదీస్తే సరి. అలానే ఎంబ్రాయిడరీ ఫ్రేమ్ చుట్టూ పూలతని అల్లించి దాన్ని మండపానికి వెనుక పెట్టండి.
- ఇక రంగు కాగితాలతో రకరకాల పూలను, ఆకులను కత్తిరించుకుని అవి ఏకదంతుడికి వెనుక వచ్చేలా ఏర్పాటు చేస్తే అలంకరణ అలరిస్తుంది. ఇలా మీ సృజనకు పదును పెట్టి మరిన్ని ప్రయత్నించండి.