తేనెటీగలు పరపరాగ సంపర్కం ద్వారా పంటలు పండటానికి తోడ్పడతాయి. తేనెను తయారుచేస్తాయి. ప్రకృతిని సమతౌల్యం చేయడంలో వాటిదే కీలకపాత్ర... తేనెటీగల గురించి ఇలాంటి విషయాలు మనకు తెలిసినవే. కొత్త విషయం ఏంటంటే... అవి మంచి కళాఖండాలనూ సృష్టించగలవు. కావాలంటే మీరే చూడండి... ఇక్కడ కనిపించే అందమైన బొమ్మలను తయారుచేసింది తేనెటీగలే. కాకపోతే వాటికి ‘టొమాస్ లిబర్టిని’ అనే కళాకారుడు కాస్త మార్గనిర్దేశం చేశాడులెండి.
ఇవి.. తేనెటీగలు కట్టిన కళాత్మక బొమ్మలు..! - bees are very talented
సాధారణంగా మనందరికీ తెలిసింది తేనెటీగలు పరపరాగ సంపర్కం ద్వారా పంటలు పండటానికి తోడ్పడుతూ, తేనేను తయారుచేస్తాయి. కానీ వాటిలో మనకు తెలియని మరో కొత్త కోణం దాగుంది. అవేంటో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? అయితే చదివేయండి మరీ.!
ఇవి.. తేనెటీగలు కట్టిన బొమ్మలు!
నెదర్లాండ్స్‌లో ఉండే కళాకారుడు టొమాస్‌కి అందరిలా మట్టి, లోహంలాంటి వాటితో కళాఖండాలను చెయ్యడం నచ్చలేదు. అందుకే, తేనెటీగల సాయంతో తేనె పట్టుతోనే కళారూపాలను సృష్టించాలనుకున్నాడు. అందులో భాగంగానే ఒకప్పటి ఈజిప్టు అందాల రాణి ‘నెఫ్రటిటి’తో పాటు ఇతర రూపాల త్రీడీ నమూనాలను తయారుచేశాడు. తేనెటీగలు వాటిదగ్గరకు వచ్చి తేనెపట్టు పెట్టేలా శిక్షణ ఇచ్చాడు. ఫలితం... అవి ఇంత అందమైన కళాఖండాలను సృష్టించాయి. ఔరా... అనిపిస్తోంది కదూ..!