ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణ జిల్లా గన్నవరం సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీ సత్య సాయి మొబైల్ మెడికేర్ ప్రాజెక్ట్ ట్రస్ట్ అంబులెన్స్‌ను గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడంతో ప్రమాదం సంభవించింది. అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్న ట్రస్ట్‌కు సంబంధించిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
అంబులెన్స్‌ను ఢీకొన్న గుర్తుతెలియని వాహనం...ఇద్దరు మృతి - రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
గుర్తుతెలియని వాహనం అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలో జరిగింది.
అంబులెన్స్‌ను ఢీకొన్న గుర్తుతెలియని వాహనం...ఇద్దరు మృతి
మృతులు జార్ఖండ్‌కు చెందిన భాస్కరభట్ల శ్రీనివాస శాస్త్రి, రవిశంకర్ శాస్త్రిగా గుర్తించారు. గన్నవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి:'కాంగ్రెస్‌లోనే ఉంటానని నా తండ్రిపై ప్రమాణం చేశాను'