పెద్దపల్లి జిల్లా రామగుండంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివసిస్తున్న బషీర్ ఎన్టీపీసీ ఆటో నగర్లో చికెన్ సెంటర్లో పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి పని ముగిసిన అనంతరం రామగుండం వైపునకు వెళ్లేందుకు ప్రశాంత్ నగర్ వద్ద ద్విచక్ర వాహనంపై రహదారి దాటుతుండగా రామగుండం వైపు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొట్టింది. బషీర్‌ను 100 మీటర్ల వరకు లాక్కెళ్లింది.
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఒకరి దుర్మరణం - accident in ramagundam
ద్విచక్రవాహనంపై రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టగా అక్కడికక్కడే మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో చోటుచేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రామగుండంలో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
తలకు తీవ్ర గాయాలై బషీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ప్రమాద స్థలానికి చేరుకున్న ఎన్టీపీసీ ఎస్సై స్వరూప్ రాజ్ కేసు నమోదు చేసుకొని విచారణ దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య ముగ్గురు కుమార్తెలున్నారు.
ఇదీ చూడండి :నకిలీ డాక్యుమెంట్లతో కల్యాణ లక్ష్మి నగదు కాజేసేందుకు ప్లాన్