తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

తల్లితో సహా ఇద్దరు పిల్లలు మిస్సింగ్​.. పోలీసుల దర్యాప్తు - బోయిన్​ పల్లిలో ముగ్గురు మిస్సింగ్​ వార్తలు

తల్లితో సహా ఇద్దరు పిల్లలు అదృశ్యమైన ఘటన సికింద్రాబాద్​ బోయిన్​పల్లి పరిధిలో జరిగింది. భర్త, అత్తమామలు ఇంట్లో లేని సమయంలో తన పిల్లలతో కలిసి వీణ అనే వివాహిత బయటికి వెళ్లి వస్తానని చెప్పి తిరిగిరాలేదని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. వీణ ఇంట్లో నుంచి వెళ్లిపోడానికి భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ జరిగిందా.. మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తల్లితో సహా ఇద్దరు పిల్లలు మిస్సింగ్​.. పోలీసుల దర్యాప్తు
తల్లితో సహా ఇద్దరు పిల్లలు మిస్సింగ్​.. పోలీసుల దర్యాప్తు

By

Published : Nov 2, 2020, 10:06 PM IST

సికింద్రాబాద్​ బోయిన్​పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లితో సహా ఇద్దరు చిన్నారులు అదృశ్యమయ్యారు. చిన్న తోకట్టకు చెందిన వీణ అనే మహిళ తన ఇద్దరు పిల్లలైన విష్ణువర్ధన్, దాక్షాయనిలను తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు.

భర్త, అత్తమామలు ఇంట్లో లేని సమయంలో తన పిల్లలతో కలిసి వీణ బయటికి వెళ్లి వస్తానని చెప్పి తిరిగిరాలేదని కుటుంబసభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. గత నెల 28న ఇంట్లో నుంచి బయటకు వెళ్లినట్లు వారు తెలిపారు. తమకు తెలిసిన బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఆరా తీసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు.

వీణ ఇంట్లో నుంచి వెళ్లిపోడానికి భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ జరిగిందా.. మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసుగా నమోదు చేసుకున్నారు.

ఇదీ చదవండి:మిస్సింగ్​.. వీళ్లంతా ఏమైపోతున్నారు..!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details