దుబ్బాక ఉప ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతున్నాయి. దౌల్తాబాద్ రాయపోల్ మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. వృద్ధులు, దివ్యాంగులను ప్రత్యేక వాహనాలు, వీల్‌ఛైర్లతో పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నారు. ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు ప్రతి ఓటరుకు శానిటేషన్ చేసి, శరీర ఉష్ణోగ్రతను పరీక్షించి, చేతి గ్లౌజ్‌లను పంపిణీ చేసి పోలింగ్ బూతులోకి పంపిస్తున్నారు.
ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్.. ఒక చోట స్వల్ప లాఠీఛార్జ్
సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ రాయపోల్, దౌల్తాబాద్ మండలాల్లో ప్రశాంతంగా కొనసాగుతోంది. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించినా వెంటనే వాటిని సరి చేశారు. రాయపోల్ మండలం కొత్తపల్లిలో స్వల్ప లాఠీఛార్జ్ జరిగింది. పలు పోలింగ్ కేంద్రాలను సీపీ జోయల్ డేవిస్, ఎన్నికల అదనపు వ్యయ పరిశీలకులు నరేష్ బద్వేల్ పరిశీలించారు.
ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్.. ఒక చోట స్వల్ప లాఠీఛార్జ్
స్వల్ప లాఠీఛార్జ్
రాయపోల్ మండలం కొత్తపల్లిలో ఓ ఇంట్లో ఓ పార్టీకి చెందిన కొంతమంది గుమిగూడి ప్రచారం చేస్తున్నారని సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టారు. ఈ ప్రయత్నంలో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.