రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయిని అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2.5 లక్షల విలువచేసే 7.82 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అడిషనల్ డీసీపీ తెలిపారు.
గంజాయి అక్రమ రవాణా..యువకుల అరెస్టు - పెద్దపల్లి జిల్లా నేర వార్తలు
చదువుకునే వయసులో జల్సాలకు అలవాటు పడిన కొందరు యువకులు దందాలకు పాల్పడుతున్నారు. సులభంగా డబ్బు సంపాదించడం కోసం ముఠాగా ఏర్పడి మాదక ద్రవ్యాలను చేరవేస్తూ చివరకు కటకటాలపాలవుతున్నారు. తాజాగా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
గంజాయి అక్రమ రవాణా..యువకుల అరెస్టు
చిన్న వయసులో జల్సాలకు అలవాటు పడిన యువకులు సులభంగా డబ్బు సంపాదించడం కోసం ముఠాగా ఏర్పడి గంజాయి అక్రమ రవాణాకు తెరలేపారని పోలీసులు తెలిపారు. గోదావరిఖని ప్రాంతంలోని సీఎస్పీ కాలనీలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నుంచి పెద్ద ఎత్తున గంజాయి నిల్వలు దొరికినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
ఇదీ చదవండి :భగ్గుమన్న పాతకక్షలు... వీధిలోనే పేలిన తూటాలు