ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ డివిజన్‌లో శ్రీసాయి అపార్ట్‌మెంట్‌లో చనిపోయిన రాజ్‌కుమార్‌ది ప్రభుత్వ హత్యేనని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్ ఆరోపించారు. అపార్టుమెంటులోకి భారీగా వరద నీరు వచ్చిన సమయంలోనే రాజ్‌కుమార్ పాల్‌ప్యాకెట్ కోసం కిందకొచ్చారని... నీళ్లలో కాలు పెట్టగానే విద్యుదాఘాతంతో చనిపోయారని పేర్కొన్నారు.
నాలాల నిర్వహణ సక్రమంగా లేకపోవడం, వరదనీరు నిలవకుండా చర్యలు తీసుకోవడంలో జీహెచ్‌ఎంసీ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ పార్టీ సమావేశానికి వస్తున్నట్లు తెలుసుకుని ఆయనను అడ్డుకున్నట్లు తెలిపారు.