గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం.. ఎమ్మెల్యే కారణమని లేఖ - హన్మకొండలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
18:02 June 30
గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం.. ఎమ్మెల్యే కారణమని లేఖ
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో అదాలత్ కూడలి అమరవీరుల స్ధూపం వద్ద ఓ వ్యక్తి కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. రక్తపు మడుగులో ఉన్న అతన్ని స్థానికులు హుటాహుటిన ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. వరంగల్ గ్రామీణ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేటకు చెందిన వెంకటేశ్వర్లుగా గుర్తించారు. నా చావుకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శనరెడ్డి కారణం అంటూ రాసుకున్న లేఖ కూడా పక్కనే కనిపించింది.
వెంకటేశ్వర్లు కుమారుడు రామరాజు ఓరుగల్లు జిల్లా సహకార మార్కెటింగ్ సంఘంలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నాడు. ఇటీవల ఉద్యోగం తీసేస్తున్నామంటూ పై అధికారులు చెప్పగా... వెంకటేశ్వర్లు కలత చెందాడు. ఇదే విషయమై ఎమ్మెల్యేను గతవారంలో కలవగా... నేను పరిశీలిస్తానంటూ హామి ఇచ్చినప్పటికీ ఉద్యోగం పోతుందన్న ఆందోళనతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. వెంకటేశ్వర్లుగా రాశాడని చెబుతున్న లేఖపైనా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ్.